YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సింగరేణిలో ఉద్యోగుల జాతర

సింగరేణిలో ఉద్యోగుల జాతర

అదిలాబాద్, జనవరి 22, 
అన్ని ఉద్యోగాలు వేరు. సింగ‌రేణి ఉద్యోగాలు వేరు. వాటికోసం నిరుద్యోగుల వెయిటింగ్ కూడా వేరేలా ఉంటుంది. సింగ‌రేణి  ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నాం అని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచి.. నిరుద్యోగులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అప్లై చేయాలి.. ఎలా అప్లై చేయాలి.. ఏ పోస్ట్ కి అప్లై చేయాలి అంటూ.. ఎంతో ఆశ ప‌డుతున్నారు. వారి కోసం మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ స‌ర్కార్. ఇక అప్లై చేసుకోండి.. సింగ‌రేణిలో ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నాం అంటూ నోటిఫికేష‌న్ ఇచ్చింది సింగ‌రేణి సంస్థ‌.అయితే.. ఉద్యోగాలు మాత్రం వేల‌ల్లో లేవు. అఫ్ కోర్స్.. సింగ‌రేణి ఉద్యోగాల భ‌ర్తీ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటుంది. ఈసారి కూడా.. త‌క్కువ డిజిట్ ఉద్యోగాలే భ‌ర్తీ కానున్నాయి. మొత్తం 372 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది సింగ‌రేణి సంస్థ‌. ఆ డీటెయిల్స్ అన్నీ నోటిఫికేష‌న్లో ఇచ్చింది. వాటిలో.. ఫిట్ట‌ర్ ట్రైనీ పోస్టులు 128 ఉన్నాయి. ఈ ఉద్యోగాల్లో లోక‌ల్ కేట‌గిరీలోనే 105 పోస్టులున్న‌య్. అన్ రిజ‌ర్వ్డ్ కేట‌గిరీలో.. 25 పోస్టులు ఉన్న‌య్. ఎల‌క్ట్రీషియ‌న్ ట్రైనీ పోస్టులు మొత్తం 51 భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో లోక‌ల్ అభ్య‌ర్థుల‌కు 43.. అన్ రిజ‌ర్వ్డ్ కేట‌గిరీలో.. 8 ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. వెల్డ‌ర్ ట్రైనీ కేట‌గిరీలో 54 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది సింగ‌రేణి సంస్థ‌. వీటిలో కూడా లోక‌ల్ అభ్య‌ర్థుల‌కు 44 ఉద్యోగాలు కేటాయించ‌గా.. అన్ రిజ‌ర్వ్ డ్ అభ్య‌ర్థుల‌కు 10 ఉద్యోగాలు ఇవ్వ‌నున్నారు. ట‌ర్న‌ర్ లో కూడా 22 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వీటిలో కూడా లోక‌ల్ వారికే 18 ఉద్యోగాలు కాగా.. అన్ రిజ‌ర్వ్ డ్ కేట‌గిరీలో మిగిలిన 4 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మోటార్ ట్రైనీ విభాగంలో 14 పోస్టులు ఖాళీ ఉండ‌గా.. లోక‌ల్ వారికి 12 పోస్టులు.. అన్ రిజ‌ర్వ్డ్ వారికి 2 పోస్టులు ఇవ్వ‌నుంది సింగ‌రేణి సంస్థ‌. ఫైండ్రీ మ్యాన్ విభాగంలో మొత్తం 19 పోస్టులు ఖాళీ ఉండ‌గా.. వాటిలో లోక‌ల్ వారికి 16 పోస్టులు.. అన్ రిజ‌ర్వ్ డ్ కేట‌గిరీలో.. 3 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్స్ విభాగంలో కూడా 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిలో లోక‌ల్ వారితో.. 67 పోస్టులు భ‌ర్తీ చేయ‌గా.. మిగిలిన 17 ఉద్యోగాలు అన్ రిజ‌ర్వ్డ్ కేట‌గిరీలో భ‌ర్తీ చేస్తారు. లోక‌ల్ కేట‌గిరీలో.. ఉమ్మ‌డి జిల్లాలైన ఖ‌మ్మం, ఆదిలాబాద్, వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ జిల్లాల వారు అప్లై చేసుకోవ‌చ్చు. మిగతా పోస్టుల‌కు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రూ అప్లై చేసుకోవ‌చ్చు.

Related Posts