YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం దేశీయం

చందా కొచ్చర్ కు బెయిల్

చందా కొచ్చర్ కు బెయిల్

చందా కొచ్చర్ కు బెయిల్
ముంబై, ఫిబ్రవరి 12, 
 ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఎండీ చందా కొచర్‌కు ఊరట లభించింది. ఐసీఐసీఐ -వీడియోకాన్‌ రుణా కుంభకోణంకేసులో ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు చందా కొచర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు హాజరైన ఆమెకు 5 లక్షల రూపాయల పూచీకత్తుతో  కొచ్చర్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు,  కోర్టు అనుమతి లేనిదే  దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు ఈ ఏడాది జనవరి 30న చందా కొచర్‌,ఆమె భర్త దీపక్‌, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు.  దీన్ని విచారించిన కోర్టు  బెయిల్‌  మంజూరు చేసింది. కాగా ఐసీఐసీఐ స్కాంలో ‍ చందా కొచర్‌  వీడియోకాన్‌ గ్రూప్‌నకు రూ.3,250 కోట్ల రుణం మంజూరులో  క్విడ్‌ప్రోకో  ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు చందా కొచర్‌ నేతృత్వంలోని బ్యాంక్ ప్యానెల్ మంజూరు చేసిన రూ .300 కోట్ల రుణ మొత్తంలో రూ .64 కోట్లు వీడియోకాన్ ఇండస్ట్రీస్ నుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్)కు బదిలీ అయినట్టు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచర్‌పై మనీలాండరింగ్ కింద కేసులు నమోదయ్యాయి. 2019లో సీబీఐ కేసు నమోదు చేయగా 2020లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది.  ఈనేపథ్యంలో 2020 సెప్టెంబర్‌లో చందా కొచర్‌ దంపతులను ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Related Posts