YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆలస్యంగా మామిడి పూత

ఆలస్యంగా మామిడి పూత

ఆలస్యంగా మామిడి పూత
కరీంనగర్, ఫిబ్రవరి 17, 
తెగుళ్లతో మామిడి రైతు డీలా పడుతున్నాడు. పంట పిందె దశకు చేరుకోవాల్సి ఉండగా, వివిధ రకాల చీడపీడలు ఆశిస్తుండటంతో ఇంకా పూత దశలోనే ఉంది. జగిత్యాల మామిడి తోటలకు పేరుగాంచింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల ఎకరాల పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి 8 రాష్ట్రాలకు పంట సరఫరా అవుతుంది. ఈసారి పరిస్థితులను చూసి వ్యాపారులు కూడా వెనుకడుగు వేసే అవకాశం ఉంది. అయితే రైతుకు ఈసారి ప్రతికూల పరిస్థితులున్నాయి. డిసెంబరు చివరి వారం నుంచే పూత రావాల్సి ఉండగా, ఫిబ్రవరి రెండవ వారం గడుస్తున్నా ఇంకా చాలా చోట్ల పూత కనిపించడం లేదు. భిన్నమైన వాతావరణంతోనే పూత రావడం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చల్లని గాలులు వీస్తే పూత ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. ఈసారి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పూత ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫిబ్రవరి రెండవ వారంకల్లా మామిడి పిందె దశకు చేరుకోవాలి. కానీ చాలా చోట్ల ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పూత కూడా కనబడటం లేదు.  రైతులు సకాలంలో సస్య రక్షణ చర్యలు చేపడితే పంటను కాపాడుకునే అవకాశం ఉందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి  చెప్పారు. రాలుతున్న ఆకులను వ్యవసాయాధికారులకు చూపిస్తే, వాటిని పరీక్షించి వారు తగు సూచనలు చేస్తారని, రైతులు ఆలస్యం చేయకుండా ఆ సూచనలను పాటించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చని ఆయన సూచించారు.మామిడి పంటకు తేనె మంచు, బూడిద తెగులు ఆశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో బంగినపల్లి రకం ఎక్కువగా సాగవుతుంది. ఇది ఎగుమతికి అనుకూలమైన రకం కావడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారు లు ఇక్కడికి వచ్చి పంట కొనుగోలు చేస్తుంటారు. ఏటా రూ.100కోట్ల మేరకు వ్యాపారం సాగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఏడాది రైతు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తేనె మంచు, బూడిద తెగులుతో పిందె, ఆకులు రాలిపోతున్నాయి. పిందెల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఈసా రి సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Related Posts