YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

గుడిమల్కాపూర్ మార్కెట్ లో వ్యాపారుల అందోళన

గుడిమల్కాపూర్ మార్కెట్ లో వ్యాపారుల అందోళన

గుడిమల్కాపూర్ మార్కెట్ లో వ్యాపారుల అందోళన
హైదారాబాద్ ఫిబ్రవరి 17,
గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్ లో రిటైల్ కూరగాయల వ్యాపారులు  ఆందోళనకు దిగారు. హోల్ సేల్  వ్యాపారులు 5 కిలోలు 10 కిలోల చొప్పున కూరగాయలు విక్రయించడం నిబంధనలకు విరుద్ధం అని, వారు కేవలం 50 కిలోల పైన మాత్రమే విక్రయించాలని చిరు వ్యాపారులు తెలిపారు. కేవలం కిలోల చొప్పున కూరగాయలు అమ్ముకునే తమ కోసం రిటైల్ మార్కెట్ ఏర్పాటు చేశారని ఈ సమయంలో  కమిషన్ ఏజెంట్లు 5 కిలోలు 10 కిలోల చొప్పున కూరగాయలను విక్రయించొద్దని ఒప్పందం కుదిరిందని రిటైల్ వ్యాపారుల ప్రతినిధి జయరాజ్ పేర్కొన్నారు.
ఇందుకు విరుద్ధంగా కమిషన్ ఏజెంట్లు కూరగాయలను చిల్లరగా విక్రయించడం వల్ల రిటైల్ మార్కెట్ లో దుకాణాలు ఏర్పాటు చేసుకొని కుటుంబాలను పోషికుంటున్న తమ పొట్ట పై కొడుతున్నారని కూరగాయల చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.. మార్కెట్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. హోల్ సేల్ వ్యాపారులు చిల్లర వ్యాపారం చేయకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Related Posts