YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

కాసులు కురిపిస్తున్నఇసుక

కాసులు కురిపిస్తున్నఇసుక

కాసులు కురిపిస్తున్నఇసుక
కరీంనగర్, ఫిబ్రవరి 24, 
కరీంనగర్‌ జిల్లాలోని 13 ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరా చేస్తున్నారు. 2020 ఫిబ్రవరి 16న జిల్లాలో ప్రభుత్వ పనుల కోసం, 2020 మార్చి 16న గృహ నిర్మాణ వినియోగదారుల కోసం రీచ్‌లను ప్రారంభించి సాండ్‌ టాక్స్‌ను ప్రవేశ పెట్టారు. అధికారికంగా గుర్తించిన ఈ రీచ్‌ల ద్వారా ఇసుకను తరలించేందుకు 1,406 ట్రాక్టర్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. మీ సేవ కేంద్రాలు, యాప్‌ల ద్వారా ఇసుక బుక్‌ చేసుకున్న ట్రాక్టర్ల యజమానులకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) హైదరాబాద్‌ ద్వారా ఇసుక అలాట్‌ చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇండ్లు నిర్మించుకుంటున్న యజమానులకు రోజుకు ఐదు ట్రాక్టర్ల ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో తెలంగాణ ఇసుక విధానం ద్వారా ప్రభుత్వ పనులకు 15,327 ట్రాక్టర్లు అంటే 45,960 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను, ప్రైవేట్‌ గృహ నిర్మాణాలకు 80,315 ట్రాక్టర్లు అంటే 2,40,945 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను సరఫరా చేసినట్లు మైనింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఇసుక విధానం ద్వారా రోజుకు జిల్లాలోని 1,500 నుంచి 2 వేల మంది కూలీలకు ఉపాధి లభిస్తున్నది.మన ఇసుక విధానం ప్రవేశ పెట్టిన తర్వాత మొత్తం రూ.42 కోట్ల 11 వేల 19 ఆదాయం వచ్చినట్లు మైనింగ్‌ ఏడీ సత్యనారాయణ తెలిపారు. ఇందులో ట్రాక్టర్‌ ఓనర్స్‌, లేబర్‌ కోసం రూ.18,96,27,825, డీఎంఎఫ్‌కు రూ.33,05,268, ఎస్‌ఎంఈటీకి రూ.2,20,03,610, ఐటీకి రూ.2,20,316, ఫీజ్‌ అమౌంట్‌ కింద రూ.1,10,13,120, విలేజ్‌ ఫండ్‌ కింద రూ.21,36,40,835 చెల్లింపులు జరిపామన్నారు. కాగా, ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. 2019-20లో 645 కేసులు నమోదు చేసి రూ.91,36,935, 2020-21లో ఇప్పటి వరకు 284 కేసులు నమోదు చేసి రూ.25,94,730 జరిమానా విధించారు.ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్న గ్రామాలకు మంచి ఆదాయం సమకూరుతున్నది. 2020 ఫిబ్రవరి 16 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు ఆయా గ్రామాలకు సీనరేజ్‌ నిధులను జమ చేశారు. ఇందులో చేగుర్తి (కరీంనగర్‌ రూరల్‌) రూ.9,14, 500, బొమ్మకల్‌ (కరీంనగర్‌ రూరల్‌) రూ.20,28,500, లింగాపూర్‌ (మానకొండూర్‌) రూ.12,78,900, వెల్ది (మానకొండూర్‌) రూ.11,28,300, ఊటూరు (మానకొండూర్‌) రూ.10,97,600, చల్లూరు (వీణవంక)రూ.11,41,100, తనుగుల (జమ్మికుంట) రూ.2,65,300, రామంచ (చిగురుమామిడి) రూ.3,86,100, రేణికుంట/ కొత్తపల్లి (తిమ్మాపూర్‌) రూ.2,40,100, చొక్కారావుపల్లి (గన్నేరువరం) రూ. 54,500, ఇప్పలపల్లి (వీణవంక) రూ.1,00,500, మల్లారెడ్డిపల్లి (వీణవంక) రూ.79,400, శ్రీనివాసనగర్‌ (మానకొండూర్‌)కు రూ.2,99,100 జమ చేసినట్లు మైనింగ్‌ ఏడీ సత్యనారాయణ తెలిపారు. కాగా, ఈ ఏడాది కొత్తగా కరీంనగర్‌ మండలం ఇరుకుల్లలో ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేశారు.

Related Posts