YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం దేశీయం

బిట్ కాయిన్ తో పెరిగిపోతున్ననేరాలు.. అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం

బిట్ కాయిన్ తో పెరిగిపోతున్ననేరాలు.. అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 25 
కొత్తగా పుట్టుకొచ్చిన క్రిప్టో కరెన్సీ లేదా బిట్ కాయిన్ (ఆన్ లైన్ కరెన్సీ) ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు ఆదరణ పొందటం తో పాటు నేరాలు మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. క్రిప్టో కరెన్సీ నిషేధం దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం తాజా బడ్జెట్ సమావేశాల్లోనే ఓ బిల్లును రూపొందించింది. ‘ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్-2021’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారని సమాచారం.ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ క్రిప్టో కరెన్సీ స్థానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ‘అధికారిక డిజిటల్ కరెన్సీ’ని తీసుకొస్తుందని.. దాని నియమావళి రూపకల్పనకు ఈ బిల్లు తోడ్పడుతుందని సమాచారం. క్రిప్టోకరెన్సీ సాంకేతిక నేపథ్యం ఆధారంగా దేశంలో రుపీ డిజిటల్ వెర్షన్ ను తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోందట.. ఆన్ లైన్ లో కూడా భారత ప్రభుత్వం గుర్తించే కరెన్సీ ఉండేలా భావిస్తున్నారట.. అధికారిక డిజిటిల్ కరెన్సీని తీసుకొచ్చేందుకు అవసరమైన నియమావళిని రూపొందించేందుకు దేశంలో ప్రైవేటు క్రిప్టోకరెన్సీని నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు తెలిసింది.భారత్ లో డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తాజాగా అధికారికంగా స్పందించారు. డిజిటల్ రూపంలో కరెన్సీని అందుబాటులోకి తెచ్చే దిశగా ఆర్బీఐ పనిచేస్తున్నట్లు తెలిపారు.దీనికి అవసరమయ్యే టెక్నాలజీ విధివిధానాలపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే స్వదేశీ క్రిప్టో కరెన్సీని అధికారికంగా విడుదల చేస్తామన్న ఆయన.. ప్రైవేటు డిజిటల్ రెన్సీలు వర్చువల్ కరెన్సీలతో సమస్యలకు చెక్ పెడుతామని స్పష్టం చేశారు.

Related Posts