YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

మిషన్ మార్స్ లో ఇండియన్స్

 మిషన్ మార్స్ లో ఇండియన్స్

హైదరాబాద్, మార్చి 3, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు మార్స్ మిషన్‌లో భారతీయులు కీలకంగా వ్యవహరించనున్నారు. భారతీయ అమెరికన్‌ అయిన విష్ణుశ్రీధర్‌ మార్స్‌ పైనున్న పర్సెవరెన్స్‌ రోవర్‌కు అమర్చిన కెమెరా సూపర్‌క్యామ్‌ను లీడ్‌ చేయనున్నారు. ఐదేళ్లుగా కాలిఫోర్నియాలోని నాసా జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ (జేపీఎల్‌)లో శ్రీధర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీధర్‌కు మార్స్‌ పైకి పంపిన పర్సెవరెన్స్‌ రోవర్‌కు అమర్చిన సూపర్‌క్యామ్‌ను ఆపరేట్‌ చేస్తున్న బృందాన్ని లీడ్‌ చేసే అవకాశం దక్కింది. ఈ కెమెరాతో అక్కడి అతి సూక్ష్మ కణాలను సైతం ఫొటోలు తీసి.. అక్కడ జీవం ఉండేదా.. లేదా? అనే అంశంతోపాటు అక్కడి వాతావరణ పరిస్థితులు అంచనా వేయవచ్చు.పర్సెవరెన్స్‌ రోవర్‌ను గతేడాది జూలై 30న లాంచ్‌ చేస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 18న అరుణగ్రహంపై దిగింది. మార్స్‌పైకి నాసా రోవర్‌ దింపే కంట్రోల్‌ ఆపరేషన్లలో భారతీయ అమెరికన్‌ మహిళ స్వాతిమోహన్‌ కీలకపాత్ర పోషించటం విశేషం. నాసాలో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది శాస్త్రవేత్తలు ఎదురుచూస్తుంటారు. అలాంటిది శ్రీధర్ ఇంటి నుంచే పనిచేస్తూ.. సుమారు 22వేల కోట్ల ప్రాజెక్టును కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఓ భారతీయుడి ఇంతటి ఘనత సాధించటం మన దేశానికే గర్వకారణం. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌ గుప్తా ఖనిజాల గుట్టు విప్పడంలో నిపుణుడు. ఆయన కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొపెల్షన్‌ ల్యాబొరేటరీలోనే పనిచేయాల్సి ఉన్నది. కానీ, కొవిడ్‌ నిబంధనల కారణంగా ఇంటినుంచే పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇంతటి విలువైన ప్రాజెక్టును సైతం ఇంటినుంచే ఆపరేట్ చేయాల్సి వచ్చింది.ఎలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ అంతరిక్షంలోని తమ ఉపగ్రహాల ఆధారంగా భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించనున్నది. స్టార్ లింక్ పేరుతో తన సేవలను విస్తరించనుంది. వినియోగదారులు 99 డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.7000 చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు

Related Posts