YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గత , ప్రస్తుత రాష్టృ ప్రభుత్వాల వలనే స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన నిర్వాసితులకు బీజేపి ద్వారా న్యాయం జరుగుతుంది

గత , ప్రస్తుత రాష్టృ ప్రభుత్వాల వలనే స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన   నిర్వాసితులకు బీజేపి ద్వారా న్యాయం జరుగుతుంది

విశాఖపట్నం మార్చ్ 10, 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణం యాజమాన్య లోపంతో పాటు , గత టీ.డీ.పి ప్రస్తుత వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వాలే కారణమని, పోస్కో కంపెనీ వారు 2016 లో అప్పటి సి.యం చంద్రబాబు నాయుడు గారిని, 2020 ప్రస్తుత సి.యం జగన్ మోహన్ రెడ్డి గారిని కలసి అన్ని మంతనాలు, అంగీకారాలు రాష్టృ ప్రభుత్వం చేసుకున్నాక మాత్రమే కేంధ్ర ప్రభుత్వం దగ్గరకి వెల్లి ఆమోదం పొందిందని, నీతి అయోగ్ సూచనల మేరకు దేశ వ్యాప్తంగా నష్టాల బారినపడ్డ  ప్రభుత్వరంగ సంస్థలను లాభాల బాటలోకి తీసుకురావాలంటే ప్రైవేటీకరణ చేయడం మంచిదని వారి సూచనలు కూడా ఓక కారణమని , మరియు ప్రభుత్వాలు వ్యాపారం చేయడం ఏ దేశంలోనూ సాధ్యంకాలేదన్న నిజాన్ని ప్రజలు అర్దం చేసుకోవాలని బీజేపి గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు చెప్పారు. ప్రభుత్వం అప్పులు పాలైతే ప్రజలు అప్పులు పాలైనట్టేనని అన్నారు. ఉక్కు కర్మాగార కార్మికులకు, నిర్వాసితులకు ఎటువంటి అన్యాయం  జరగదని, వారికి కేవలం బీజేపి వలనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఉక్కు కర్మాగారం కోసం వేల యకరాల భూమి ఇచ్చిన 8000 మంది నిర్వాసితులకు ఇంతవరకు ఉద్యోగం రాలేదని, ఉక్కు మిగులు భూములలో కొత్త అనుబంద కంపెనీలు పెట్టి లక్ష మంది నిరుద్యోగులకు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు. నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు వారితో కలసి పోరాటం చేస్తామని చెప్పారు.

Related Posts