YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆన్ లైన్ చెల్లింపులతో చిక్కులు

ఆన్ లైన్ చెల్లింపులతో చిక్కులు

హైదరాబాద్, మార్చి 18, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల తరహాలోనే ఆర్థిక రంగం కూడా అందిపుచ్చుకుంటున్నది. ఆన్‌లైన్‌ వేదికలపై మెరుగైన సేవలను అందిస్తున్నది. ముఖ్యంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎన్నో సౌకర్యాలను కల్పించాయి. డిజిటల్‌ పేమెంట్ల కోసం అనేక యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో లావాదేవీలన్నీ కూర్చున్న చోటు నుంచే జరిగిపోతున్నాయి. సామాన్యులు సైతం షాపింగ్‌ మాల్స్‌ మొదలు, ఫుట్‌పాత్‌ మీద ఏ వస్తువును కొనుగోలు చేసినా డిజిటల్‌ యాప్‌ల ద్వారానే చెల్లించడం పరిపాటిగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య మొదలవుతున్నది. 2019-20కిగాను ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం మునుపెన్నడూ లేనివిధంగా ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఫిర్యాదులు వచ్చాయి మరి.ఆర్బీఐ నివేదిక ప్రకారం 57.54 శాతం ఫిర్యాదులు పెరిగాయి. మొత్తం ఫిర్యాదుల్లో ఒక్క బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ నుంచే 44.66 శాతం ఫిర్యాదులు అందాయి. అందులో ప్రధానంగా సకాలంలో సేవలను అందించకపోవడం, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా లేవీ చార్జీలను వసూలు చేయడం వంటి వాటిపైనే ఎక్కువగా ఉన్నాయి. ఇక గతంతో పోల్చితే ఈసారి ఎన్‌బీఎఫ్‌సీలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ముందుగా సమస్యను సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారి దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లాలి. నెల రోజుల్లో సమస్యను పరిష్కరించని పక్షంలో అంబుడ్స్‌మన్‌ అధికారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులో బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలుండాలి. నేరుగా లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడా విఫలమైతే.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. అక్కడ ఖాతాదారుని వాదని నిజమని తేలితే ఫిర్యాదు చేసిన రోజు నుంచి కేసు తుది విచారణ వరకు రోజుకు రూ.100 చొప్పున బ్యాంకుకు జరిమానా విధిస్తారు.  ఆ మొత్తంతో పాటు ఖాతాదారుడు నష్టపరిహారాన్ని కూడా పొందవచ్చు.

Related Posts