YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జీఎపీఎల్ ఇమేజింగ్ ద్వారా టోల్ సేక‌రణ: ర‌వాణా శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

జీఎపీఎల్ ఇమేజింగ్ ద్వారా టోల్ సేక‌రణ: ర‌వాణా శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

న్యూఢిల్లీ మార్చ్ 18 
వాహ‌నాల‌పై ఉండే జీఎపీఎల్ ఇమేజింగ్ ద్వారా టోల్ సేక‌రిస్తారని కేంద్ర రోడ్డు ర‌వాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ వెల్ల‌డించారు. మ‌రో ఏడాదిలోపు ఇండియాలో టోల్ ప్లాజాలు మొత్తం ఎత్తేస్తామ‌ని, జీపీఎస్ ఆధారిత టోల్ సేక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని గ‌డ్క‌రీ చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వాడుతున్నాయని, మిగిలిన 7 శాతం వాహ‌నాల‌కు రెట్టింపు టోల్ వేసినా ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేద‌ని ఆయ‌న తెలిపారు. గురువారం లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా గ‌డ్క‌రీ ఈ విష‌యాన్ని చెప్పారు. దేశంలో ఏడాదిలోపే భౌతిక టోల్ ప్లాజాల‌ను మొత్తం ఎత్తేస్తామ‌ని స‌భ‌కు హామీ ఇస్తున్నాము. అంటే టోల్ సేక‌ర‌ణ అనేది జీపీఎస్ ద్వారానే న‌డుస్తుంది.. ఇక ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ చెల్లించని వాహ‌నాలపై తాము పోలీసు విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా నితిన్ గ‌డ్క‌రీ చెప్పారు. వాహ‌నాల‌కు ఫాస్టాగ్ లేక‌పోవ‌డం వ‌ల్ల టోల్ చోరీ, జీఎస్టీ ఎగ‌వేయ‌డంలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్లడించారు. 2016లో తొలిసారి ప్ర‌వేశ‌పెట్టిన ఈ ఫాస్టాగ్‌ల‌ను గ‌త నెల 16 నుంచి త‌ప్ప‌నిస‌రి చేశారు.

Related Posts