YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

బంగారం వెలవెల

బంగారం వెలవెల

బంగారం వెలవెల
ముంబై, మార్చి 19, 
బంగారం ధర వెలవెలబోయింది. పసిడి రేటు నేలచూపులు చూస్తోంది. బంగారం ధర దిగొచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పడిపోయింది.
ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.1 శాతం క్షీణించింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,904కు దిగొచ్చింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి రేటు కేజీకి 1 శాతం పడిపోయింది. దీంతో రేటు రూ.67,100కు తగ్గింది.బంగారం ధరకు రూ.45200, రూ.45600 వద్ద నిరోధం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. అలాగే 44100 వద్ద మద్దతు లభిస్తుందని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగివచ్చింది. బాండ్ ఈల్డ్ పెరగడం, డాలర్ బలపడటం వల్ల బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 0.4 శాతం క్షీణతతో 1730 డాలర్లకు తగ్గింది. పసిడి రేటు 1745 డాలర్ల కిందనే ఉండొచ్చని జియోజిత్ తెలిపింది. ఒకవేళ బంగారం ధర 1660 డాలర్ల కిందకు వస్తే ఇంకా భారీగా పడిపోయే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అలాగే 1760 డాలర్ల పైకి చేరితే పసిడి మరింత పెరగొచ్చని పేర్కొంది.

Related Posts