YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఇన్నర్ రింగ్ రోడ్డుతో రియల్ బూమ్

ఇన్నర్ రింగ్ రోడ్డుతో రియల్ బూమ్

హైద్రాబాద్, మార్చి 20, 
హైదరాబాద్‌ మహానగరాన్ని అభివృద్ధి చేయడానికి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు 30కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. బడ్జెట్‌లో నిధులూ కేటాయించింది. అయితే, అవుటర్‌ రింగ్‌ రోడ్డును బడాబాబుల కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ అలైన్‌మెంట్‌ మార్చారని, అదే బాటలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సైతం బడా పారిశ్రామిక వేత్తలు, అధికారపార్టీ నేతలకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చడానికి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు విమర్శలూ లేకపోలేదు. ఈ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన అలైన్‌మెంట్‌, డిజైన్లు, మ్యాపులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతోపాటు పార్లమెంట్‌లోనూ ఈ రింగ్‌రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. పార్లమెంట్‌లో ఆమోదం రాగానే అలైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని భూముల ధరలు అమాంతం పెరిగాయి.హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఎండీపీ)లో భాగంగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. ఉత్తర, దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. అవుటర్‌రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్యలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, ఫార్మాసిటీ, ఐటీ హబ్‌, బయోటెక్నాలజి, లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు. వీటితోపాటు ఈ రింగ్‌రోడ్డును అర్బన్‌నోడ్స్‌, అర్బన్‌ సెంటర్లకు అనుసంధానం చేయడానికి అలైన్‌మెంట్‌ సైతం రూపొందించారు.అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు 30కిలోమీటర్లు, నగరానికి 40నుంచి 50కిలోమీటర్ల దూరంలో రీజినల్‌ రింగ్‌రోడ్డును నిర్మించాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 338కి.మీ పోడవు గల ఈ రోడ్డులో ఇప్పటికే చదును చేసిన, చేయని 58శాతం రోడ్లు ఉన్నాయి. కొత్తగా 42శాతం రోడ్లకు అలైన్‌మెంట్‌ తయారు చేయాల్సి ఉంది. సంగారెడి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌, ఆమన్‌గల్‌, యాచారం, కందుకూరు, షాద్‌నగర్‌, చేవెళ్ల, కంది పట్టణాలను అనుసంధానం చేయనున్నారు. మొదటి దశలో 152కిలోమీటర్లు సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌, రెండో దశలో 186కిలోమీటర్లు ఆమన్‌గల్‌ నుంచి కంది వరకు ఉంటుంది. ఎన్‌హెచ్‌ 65, ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌163, ఎన్‌హెచ్‌ 765 జాతీయ రహదారులతో రింగ్‌ రోడ్డు ఏర్పడనుంది.రిజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు నాలుగు లైన్ల రోడ్డు అయితే సుమారు రూ.13వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. భూసేకరణకు సుమారు రూ.3వేల కోట్లు అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1500కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 11వేల ఎకరాల భూములను సేకరించాల్సి ఉంటుందని అంచనా.హైదరాబాద్‌ నగరానికి మణిహారంలా నిర్మించనున్న రిజినల్‌ రింగ్‌రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన వెంటనే ప్రాథమిక పనులను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.750కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఆరేండ్లు పట్టే అవకాశముందని అధికారుల అంచనా.

Related Posts