YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ విదేశీయం

పెరిగిన దోసె, ఇడ్లీ ధరలు..తగ్గిన దిగుమతులు

పెరిగిన దోసె, ఇడ్లీ ధరలు..తగ్గిన దిగుమతులు

హైదరాబాద్, మార్చి 22, మయన్మార్ రాజకీయ సంక్షోభం.. మన దేశంలో ఇడ్లీ, దోశ, వడకు సెగ పెడుతోంది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. దానికి వ్యతిరేకంగా బయటకొచ్చి నిరసన చేసేటోళ్లను సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతోంది. ఆ అల్లర్ల ప్రభావం మినుముల దిగుమతిపై పడుతోంది. మనం దిగుమతి చేసుకునే మినుముల్లో 84 % అక్కడి నుంచే వస్తాయి. దిగుమతి చేసుకున్న దాంట్లో దక్షిణాదికే 78% దాకా వస్తాయి. అక్కడి నుంచి మినుముల దిగుమతి తగ్గిపోవడంతో రేట్లపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, లక్నో వంటి సిటీల్లో మినుముల రేట్లు పెరిగాయి.2020–21 ఆర్థిక సంవత్సరానికిగానూ మయన్మార్ సహా వివిధ దేశాల నుంచి 4 లక్షల టన్నుల మినుములను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఇప్పటిదాకా 3.78 లక్షల టన్నులే నుంచి వచ్చాయి. ప్రస్తుతం మయన్మార్లో ఉన్న పరిస్థితులను చూస్తుంటే మిగతా కోటా వచ్చే చాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు. మార్చి 31 డెడ్లైన్ను ప్రభుత్వం పొడిగించినా అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. దిగుమతులన్నీ మయన్మార్లోని యాంగన్ పోర్టు నుంచే రావాల్సి ఉండడం, అక్కడ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కంటెయినర్లన్నీ నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఇంపోర్ట్స్పై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ నెలలోనే ఒక కంటెయినర్ వచ్చినా.. ఆ ఒక్క దానితో మన అవసరాలు తీరవని అంటున్నారు. దాని వల్ల భవిష్యత్లో మినుములపై కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు ధర పెరిగే చాన్స్ ఉందని చెబుతున్నారు. దేశంలో మినుము పంటలు కూడా భారీగా పడిపోయాయి. 2017–18లో 34 లక్షల టన్నుల దాకా మినుములు పండగా.. 2019–2020 నాటికి ఒక్క ఏడాదిలోనే 20 లక్షల టన్నులకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలోనే దిగుబడి 14 లక్షల టన్నులు పడిపోయింది. అంతేగాకుండా మయన్మార్లో చాలా మంది రైతులు మినుముల నుంచి పెసర పంట వైపు మళ్లుతున్నారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో పెసర్లకు ఆర్డర్లు వస్తుండడం, మన దేశ మార్కెట్లలో మినుముల దిగుమతులపై హెచ్చుతగ్గులుంటుండడంతో.. మయన్మార్రైతులు పెసర పంట వేస్తున్నారు. చైనా నుంచి పెసర్లకు డిమాండ్ ఉండడంతో ఒక్క ఏడాదిలోనే పంట ఉత్పత్తి 3 లక్షల టన్నుల నుంచి 6 లక్షల టన్నుల వరకు పెరిగిందని ఐగ్రెయిన్ అనే మార్కెట్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి రాహుల్ చౌహాన్ చెప్పారు. అదేవిధంగా 2017లో కందులు 3 లక్షల టన్నులు, మినుముల ఉత్పత్తి 6 లక్షల టన్నుల దాకా ఉందన్నారు. 2018లో మినుముల ఉత్పత్తి 5 లక్షల టన్నులకు తగ్గిందన్నారు. గత ఏడాది మరో 50 వేల టన్నులు తగ్గి 4.5 లక్షల టన్నుల మినుములే మయన్మార్లో పండాయన్నారు. మయన్మార్ ఎఫెక్ట్తో ఇప్పటికే ఢిల్లీ, లక్నో, ముంబై వంటి సిటీల్లో మినుముల రేట్లు పెరిగాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు ధరలు ఎక్కువయ్యాయి. కేంద్రం లెక్కల ప్రకారం గత నెలలో ముంబై మార్కెట్లో కిలో మినుముల హోల్సేల్ ధర రూ.97 ఉండగా.. ఇప్పుడు రూ.110కి పెరిగింది. రిటైల్ ధరలు రూ.117 నుంచి రూ.130కి చేరాయి. ఢిల్లీలో రిటైల్ ధర రూ.100 నుంచి రూ.123కి పెరగ్గా.. లక్నోలో రూ.113 నుంచి  రూ.145కి ఎగబాకాయి. అయితే, ఈ ట్రెండ్ కొద్ది రోజులే ఉంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts