YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

లేని స‌మ‌స్య‌లు సృష్టించ వద్దు.. అమెరికాకు చైనా గ‌ట్టి వార్నింగ్

లేని స‌మ‌స్య‌లు సృష్టించ వద్దు.. అమెరికాకు చైనా గ‌ట్టి వార్నింగ్

బీజింగ్ మార్చ్ 26
లేని స‌మ‌స్య‌లు సృష్టించొద్ద‌ని అమెరికాకు చైనా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌ల‌తో కూడి క్వాడ్ కూట‌మిని తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది., వీలైతే ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిర‌త‌కు స‌హ‌క‌రించండ‌ని సూచించింది. చైనా ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి క‌ల్న‌ల్ రెన్ గువోకియాంగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. క్వాడ్ స‌మావేశంలో తాము చైనా విసురుతున్న స‌వాళ్ల‌పై చ‌ర్చించిన‌ట్లు అమెరికా నేష‌న‌ల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ జేక్ స‌ల్లివాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఇలా స్పందించారు. ఇండో, ప‌సిఫిక్ ప్రాంతంలో సుస్థిర‌త కోసం తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని ఈ మ‌ధ్యే జ‌రిగిన తొలి క్వాడ్ స‌మావేశంలో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ చెప్పిన విష‌యం తెలిసిందే.కోల్డ్ వార్ మ‌న‌స్త‌త్వంఅయితే ఈ క్వాడ్ కూట‌మిని తాము వ్య‌తిరేకిస్తున్న‌ట్లు రెన్ స్ప‌ష్టం చేవారు. అమెరికా ప్ర‌మోట్ చేస్తున్న ఈ క్వాడ్ వాళ్ల కోల్డ్ వార్ మ‌న‌స్త‌త్వానికి అద్దం ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు. ఇది ఒక జ‌ట్టుగా ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డ‌మే అవుతుంది. క్వాడ్ భౌగోళిక‌రాజకీయ ఆట‌ల‌కు తెర‌లేపింది. చైనా స‌వాలు పేరుతో ఇలా స‌మూహాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. చైనా దీనిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది అని రెన్ అన్నారు. ఈ కాలంలో శాంతి, అభివృద్ధి, ఇరు వర్గాల ల‌బ్ధి పొంద‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని, అలా కాకుండా త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా వెళ్ల‌డం స‌రి కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డానికి అమెరికా అంద‌రినీ శ‌త్రువుల‌గా మార్చుకోవ‌డం, లేని ముప్పును ఊహించుకోవ‌డం చేస్తోంద‌ని రెన్ విమ‌ర్శించారు.

Related Posts