YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

విశాఖపట్నం ఏప్రిల్ 2, 
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది.కార్మిక ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంఘాలు, కార్మిక సంఘాలతోపాటు పలువురు ప్రముఖులు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం గా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక,ప్రజా సంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలంభిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 26 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి  హనుమంతరావు ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేందుకు యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.మోదీ ఇచ్చిన హామీల కు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని అన్నారు.ఈ దీక్షలో పాల్గొన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి ఎంతటి త్యాగాలకైనా వెనుకా డబోమని స్పష్టం చేశారు. రాజకీయాలకు, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అందరం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ దీక్షకు దళిత సంఘాల నేతలు కూడా మద్దతు ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలో పాల్గొన్న దళిత సంఘాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
 

Related Posts