YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

కోవిడ్ పై ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ సమీక్ష

కోవిడ్ పై  ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ సమీక్ష

హైదరాబాద్
రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. జిల్లాలో టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు పాటించేలా నిబంధనల అమలుకు కృషిచేయాలని, ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని, కోవిడ్ కేర్ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సీజన్ ను సక్రమంగా వినియోగించి, వృధా ను అరికట్టేలా చైతన్యపరచాలని అన్నారు.
ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి  రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, శ్రీనివాస్ రావు, , వైద్య, ఆరోగ్య శాఖ అడ్వైజర్  టి. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts