YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

సచివాలయ ఉద్యోగుల మృతి దురదృష్టకరం ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి - నారా చంద్రబాబునాయుడు

సచివాలయ ఉద్యోగుల మృతి దురదృష్టకరం ఉద్యోగులకు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి - నారా చంద్రబాబునాయుడు

అమరావతి
ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తున్న కరోనా బారిన పడకుండా ఉద్యోగులు సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా రక్షణ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.  వారం రోజుల వ్యవధిలో సచివాలయంలో ముగ్గురు ఉద్యోగులు కరోనా బారిన పడి మృతి చెందడం రాష్ట్రంలో ఉన్న భయంకర పరిస్థితికి అద్దం పడుతుందని అయన అన్నారు.  కరోనాతో సాధారణ పరిపాలన శాఖ సెక్షన్ ఆఫీసర్  రవికాంత్, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ  పద్మారావు, పంచాయితీ రాజ్ సెక్షన్ ఆఫీసర్ శాంతి కుమారి మృతి చెందడం దురదృష్టకరం, బాధాకరం. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ అన్ని విధాల ఆదుకోవాలి.  ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపం, అవగాహనా రాహిత్యంతో ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఉద్యోగుల రక్షణపై ముఖ్యమంత్రి ఎందుకు శ్రద్ద పెట్టడం లేదు? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి కాలు బయటకు పెట్టకుండా ఉద్యోగులను మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బెదిరింపులకు దిగడం దుర్మార్గమని అయన అన్నారు.
కరోనాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలసత్వం ప్రదర్శించడం వల్లే రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఆదాయం కోసం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి జగన్ ప్రభుత్వం వేధించింది. కరోనా నియంత్రణలో విఫలమైన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ వాక్సినేషన్ ను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి.  ఉద్యోగులకు ఎన్-95 మాస్కులు, పిపిఇ కిట్లు, శానిటైజర్ వంటివి అందజేయడంతో పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తించేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.  కరోనా బారిన పడిన ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలి. రిటైర్ అయిన ఉద్యోగుల ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుని మెరుగైన వైద్యం అందించాలి. అవసరమైన ఉద్యోగస్తులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అయన అన్నారు.

Related Posts