YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏసీబీ కస్టడీకి ధూళిపాళ

ఏసీబీ కస్టడీకి ధూళిపాళ

ఏసీబీ కస్టడీకి ధూళిపాళ
రాజమండ్రి, మే 1,
సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళఇపాళ్ల నరేంద్రనుఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను తరలించారు. ధూళిపాళ్లను ఐదు రోజులపాటు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతించడంతో రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. ధూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథాన్ని కూడా తీసుకెళ్లారు.వీరిని ఈ నెల 5 వరకు విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఏసీబీ కస్టడీలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె కన్నీరు మున్నీరైంది. కారు అద్దం తీయమని పోలీసులను బతిమలాడింది. తండ్రిని తీసుకెళ్తున్న కారు వెంట ఆమె ఆతృతగా బయలుదేరి వెళ్లింది. ఆమె ఆవేదన అక్కడ ఉన్నవారిని కంటతడిపెట్టించింది. కాగా, తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కోట్టివేసింది. ఏసీబీ కేసును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది.ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన వెంటనే సంగం డెయిరీ యాజమాన్యాన్ని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి ప్రభుత్వం బదిలీ చేశారు. సంగం డెయిరీ యాజమాన్య హక్కులు మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలపాల బాధ్యత తెనాలి సబ్ కలెక్టర్‌కు అప్పగించింది. అయితే, డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి డెయిరీని తీసుకొస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts