YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై గుర్రుగా కొఠియా గ్రామాలు

జగన్ పై గుర్రుగా కొఠియా గ్రామాలు

శ్రీకాకుళం, మే 4,
ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై ఏవోబీ (ఒడిశా-ఆంధ్ర స‌రిహ‌ద్దు) ప్రాంతంలోని 21 గ్రామాల ప్రజ‌లు నిప్పులు చెరుగుతున్నారు. ఇక్కడి కొఠియా గ్రూప్‌గా పిలుచుకునే ఈ గ్రామాల్లో గిరిజ‌నులు ఎక్కువ‌గా ఉంటున్నారు. వాస్తవానికి ఈ గ్రామాలు.. ఖ‌చ్చితంగా ఒడిశా స‌రిహ‌ద్దులో ఉన్నాయి. దీంతో అన‌ధికారికంగా ఒడిశా ప్రభుత్వ పెత్తనం ఇక్కడ ఎక్కువ‌గా ఉంటోంది. నిజానికి ఇక్కడి గ్రామాల ప్రజ‌లు.. ఒడిశాలోని ప‌లు ప్రాంతాల‌కు వెళ్లి ప‌నులు చేసుకుంటున్నారు. దీనిని అలుసుగా తీసుకున్న అక్కడి ప్రభుత్వం.. త‌మ పెత్తనం చెలాయిస్తోంది. కానీ.. ఇక్కడి ప్రజ‌ల‌కు ఓటు హ‌క్కు, ఉపాధి క‌ల్పన‌, ఇత‌ర ‌సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా.. ఏపీ ప్రభుత్వం నుంచే అందుతున్నాయి.అయిన‌ప్పటికీ.. ఒడిశా ఆధిప‌త్యంలోనే ఇక్కడి ప్రజ‌లు మ‌గ్గిపోతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తోపాటు.. పంచాయితీ, స్థానిక ఎన్నిక‌ల్లోనూ ఇక్కడి కొఠియా ప్రజ‌ల‌ను ఓటు వేయ‌కుండా ఒడిశా అడ్డుకుంది. దీనికి ప్రధాన కార‌ణం.. ఎప్పటికైనా.. తమ ప‌రిధిలోకి ఈ గ్రామాల‌ను క‌లిపిపేసుకోవ‌డ‌మే. పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏకంగా ఇక్కడ ఎన్నిక‌లు నిర్వహించ‌రాద‌ని పేర్కొంటూ.. ఒడిశా ప్రభుత్వం.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. అయితే.. అప్పటికే ఎన్నిక‌ల ప్రక్రియ ప్రారంభ‌మైనందున కొన‌సాగించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి అస‌లు.. ఎలాంటి ముంద‌స్తు హెచ్చరిక‌లు లేకుండా ఓట‌ర్లను ఒడిశా బ‌ల‌గాలు అడ్డుకున్నాయి.క్రమంలో అక్కడి ఓట‌ర్లు.. జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను ఆదుకోవాల‌ని అభ్యర్థించాయి. కానీ, జ‌గ‌న్ ప్రభుత్వం ఇప్పటి వ‌ర‌కు కూడా ప‌ట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు 80 టీఎంసీల వంశ‌ధార న‌ది నీళ్లను త‌మ‌కు కేటాయించార‌ని.. సో.. ఈ నీళ్ల విష‌యంలో అడ్డంకులు సృష్టించ‌వ‌ద్దని.. అవ‌స‌ర‌మైతే.. క‌లిసి చ‌ర్చించుకుందామ‌ని.. కోరుతూ.. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌కు సీఎం జ‌గ‌న్ లేక సంధించారు. దీనిపై ఏం జ‌రుగుతుందో తెలియ‌దు కానీ.. కొఠియాలో మాత్రం ఈ లేఖ ప్రకంప‌న‌లు సృష్టిస్తోంది.తాము ఎన్నో ఏళ్లుగా ఏపీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తున్నామ‌ని.. త‌మ‌కు పెద్ద స‌మ‌స్యగా మారిన ఒడిశా ప్రభుత్వ పెత్తనంపై ఏపీ స‌ర్కారు ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఇక్కడి ప్రజ‌లు ప్రశ్నిస్తున్నారు. జ‌గ‌న్ త‌మ గురించి స్పందించ‌కుండా ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌కు నీళ్ల స‌మ‌స్య కోసం ప‌రిష్కరించుకుందామని లేఖ రాయ‌డంపై వారు భ‌గ్గుమంటున్నారు. జ‌గ‌న్ త‌మ వివాదం ప‌రిష్కరించ‌కుండా నీళ్ల స‌మ‌స్య కోసం చ‌ర్చల‌కు వెళ్లడం స‌మంజసం కాద‌ని వారు వాపోతున్నారు. ఈ వివాదం ముదిరితే.. వారు క‌నుక ఒడిశాకు అనుకూలంగా మారితే.. ఖ‌చ్చితంగా ఏపీకి తీవ్ర అవ‌మానం ఎదురుకాక‌త‌ప్పదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related Posts