YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యాక్సినో...రామచంద్రా

వ్యాక్సినో...రామచంద్రా

విజయవాడ, మే 4, 
విడ్ వాక్సినేషన్ కోసం తంటాలు పడుతున్నారు విజయవాడ నగరవాసులు. ఫస్ట్ డోస్ ఇప్పటివరకు దొరకని పరిస్థితి విజయవాడ లో ఏర్పడింది. సెకండ్ డోస్ ఎక్కడ వేస్తారు అన్న దానిపైన పూర్తి క్లారిటీ లేదు.. అధికారుల నుంచి కూడా సమాధానం రావట్లేదు.వ్యాక్సినేషన్ ఎక్కడ దొరుకుతుందో తేలిక విజయవాడ లోని అన్ని సచివాలయాలకు నగర వాసులు తిరుగుతున్నారు. వాక్సినేషన్ ఎక్కడ చేస్తారు తెలియకుండా ఏవిధంగా వ్యాక్సిన్ వేయించుకుంటామని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని విజయవాడ వాసులు నిలదీస్తున్నారు. కో వ్యాక్సిన్ ఒక చోట, కోవి షీల్డ్ ఒక చోట చేర్చాలి ఉన్నా… ఇంతవరకు ఏది ఎక్కడ దొరుకుతుందో సరైన సమాచారం సచివాలయ ఉద్యోగులు,అధికారులు ఇవ్వలేదు. మరో వైపు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో అధికారులు సిద్దమవుతున్నారు. కొవిడ్ స్పెషలాఫీసర్ ఎంటి కృష్ణబాబు తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాడుతున్న లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్లను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేసినట్టు ఆయన చెప్పారు.ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఏపీకి ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వివరించారు. ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ 2 ట్యాంకర్లను విజయవాడ లేదా తిరుపతి నుండి వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం దిగుమతి చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ ట్యాంకు ను ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నెలకొల్పేందుకు అవకాశం ఉందని, ఒక వారం లోపు మరో రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

Related Posts