YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అన్ని ఆన్‌లైన్ క్లాసులే...క‌చ్చితంగా ఫీజులు త‌గ్గించాల్సిందే: సుప్రీంకోర్టు

అన్ని ఆన్‌లైన్ క్లాసులే...క‌చ్చితంగా ఫీజులు త‌గ్గించాల్సిందే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ మే 4
క‌రోనా కార‌ణంగా గ‌తేడాది నుంచి స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలుసు క‌దా. సాధార‌ణ స్కూలు త‌ర‌గ‌తుల‌తో పోలిస్తే ఈ ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ త‌ల్లిదండ్రుల‌కు భారంగా మారింది త‌ప్ప స్కూళ్ల‌కు ఇంకా ఖ‌ర్చు త‌గ్గించింది. అయినా కూడా ఫీజులు విష‌యంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు.. కేవ‌లం ఆన్‌లైన్ క్లాసులే అయితే క‌చ్చితంగా ఫీజులు త‌గ్గించాల్సిందే అని స్ప‌ష్టం చేసింది. ఆన్‌లైన్ క్లాస్‌ల కార‌ణంగా స్కూలు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌గ్గాయి కాబ‌ట్టి ఆ ప్ర‌యోజ‌నాన్ని త‌ల్లిదండ్రుల‌కు బ‌దిలీ చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం చెప్పింది.కొవిడ్ కార‌ణంగా వాళ్లు ప‌డిన ఇబ్బందుల‌ను స్కూలు యాజ‌మాన్యాలు అర్థం చేసుకోవాల‌ని, ఆమేరకు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని ఆదేశించింది. విద్యార్థుల‌కు అందించ‌ని వ‌స‌తుల‌కు కూడా ఫీజులు వ‌సూలు చేయ‌డం లాభార్జ‌నే అవుతుంద‌ని, అది మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. ఇక గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా చాలా కాలం స్కూళ్లు తెర‌వలేదు. దీని కార‌ణంగా పెట్రోల్‌/డీజిల్‌, క‌రెంటు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు, నీటి ఛార్జీలు, స్టేష‌న‌రీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

Related Posts