
న్యూఢిల్లీ మే 29
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మూడు చారిత్రక నిర్ణయాలు వెలువడ్డాయి. ఎనిమిది మంది పిల్లలు దాఖలు చేసిన పిటిషన్లో బొగ్గు గనిని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్కడి కోర్టు ఒకటి ఆదేశించింది. ఇదే సమయంలో అమెరికా, నెదర్లాండ్స్ ప్రభుత్వాలు చమురు కంపెనీలను మందలించాయి.పర్యావరణ పరిరక్షణ గురించి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఫెడరల్ కోర్ట్ చారిత్రక నిర్ణయం తీసుకున్నది. బొగ్గు గనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులో పిటిషనర్లు అయిన 8 మంది చిన్నారులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న బొగ్గు గనుల తవ్వకాన్ని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఫెడరల్ కోర్టు మొర్దెసాయ్ బ్రోంబెర్గ్ ఆదేశించారు. అమెరికాలో ప్రసిద్ధ చమురు కంపెనీలైన ఎక్సాన్ మొబిల్, చెవ్రాన్లను జో బైడెన్ ప్రభుత్వం మందలించింది. గ్లోబల్ వార్మింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోనందుకు పెట్టుబడిదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవ్రాన్ పెట్టుబడిదారులలో మూడింట రెండొంతుల మంది ఉద్గారాలను తగ్గించాలని ఒత్తిడి చేశారు.నెదర్లాండ్ కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పారిస్ ఒప్పందం తర్వాత 10 సంవత్సరాలలో ఉద్గారాలను 45 శాతం తగ్గించాలని చమురు కంపెనీ షెల్, ఇతరులు కోరారు. శిలాజ ఇంధనాలను తీయడాన్ని కూడా నిషేధించారు. ఈ విషయం మొత్తం ప్రపంచానికి వర్తిస్తుందని నెదర్లాండ్స్ కోర్టు వెల్లడించింది.