YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

ఉద్యోగం, ఉపాధి లేకుండా యువత విలవిల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

ఉద్యోగం, ఉపాధి లేకుండా యువత విలవిల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

హైదరాబాద్
నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ వచ్చాక  నీళ్లు ఫామ్ హౌజ్ కు,  నిధులు సీఎం అనుయాయులకు,  నియామకాలు ఆయన ఫ్యామీలిలకే పోయినాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత. ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం లేక, ఉపాధి లేక అల్లాడుతోంది. లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసీ, చూసీ చాలా మంది వయసు కూడా దాటిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది టీఎస్పీస్పీ లో రిజిస్టర్ చేసుకున్నారని పదవి విమరణ పొందిన ఛైర్మన్  ఘంటా చక్రపాణి చెప్పారు. 2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించింది. మన రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడ్డాక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదు.   నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అవగానే 50 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తోందని ఝూటా మాటలు చెప్పి యువతను మోసం చేశారు.  25 వేల విద్యుత్ ఆర్జిజన్ ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పీఆర్సీ ఇస్తామని ప్రకటించినా ఇప్పటిదాకా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా 12 వేల మంది విద్యావాలంటీర్లు పస్తులుంటున్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలొస్తాయనుకుంటే దాదాపు 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్ని రోడ్డున పడేశారు. ఇప్పటికైనా 7 వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని అయన అన్నారు.
 

Related Posts