YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ డిమాండ్

ఎమ్మిగనూరు  
రాష్ట్రంలో కరోనా వేవ్ కొనసాగుతున్నందున పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్  కమిటీ తరపున  టిఎన్ఎప్ఎఫ్  అధ్యక్షుడు మాదిగ నాగరాజు డిమాండ్ చేశారు.  మాజీ ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నాగరాజు, ఎ.సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ... కరోనా మహమ్మారి వ్యాప్తి రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోందని,  విద్యార్ధుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేసి,  వారిని కరోనా బారిన పడకుండా కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం సైతం కరోనాకు భయపడి సీబిఎస్ఈ పరీక్షలను రద్దు చేయడమే కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు సైతం ఇంటర్ పరీక్షలను రద్దు చేసిందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలని తెలిపారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు నారా లోకేష్ బుధవారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో కోరారని, వారి ఆవేదనను అర్ధం చేసుకుని ప్రభుత్వం మొండి వైఖరితో కాకుండా ఆలోచన ధోరణీతో వ్యవహరించి పరీక్షలను రద్దు చేయాలని టిఎన్ఎస్ఎప్ కమిటీ డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుతానికి పరీక్షలపై కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంలో, మెరుగైన వైద్యసేవలు అందించడంలో దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎప్ నాయకులు రాజశేఖర్, రామా నాయుడు, రంజిత్, ప్రవీణ్, నరేష్, సాయి, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts