YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

కరోనా దెబ్బకు తగ్గిన బీర్ల అమ్మకాలు

కరోనా దెబ్బకు తగ్గిన బీర్ల అమ్మకాలు

హైదరాబాద్ జూన్ 7
కరోనా మహమ్మారి వల్ల మద్యం అమ్మకాలు భారీగానే సాగుతున్నా బీరు విషయంలో మాత్రం బిజినెస్ పూర్తిగా డల్ అయిపోయిందని బీర్ కంపెనీలు పెర్కొంటున్నాయి. తెలంగాణలో గతేడాది మేలో 23.33 లక్షల కేసుల బీర్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది మే నెలలో 20 లక్షల కేసులు మాత్రమే అమ్ముడు పోయాయి. కరోనా చలిలో ఎక్కువ కాలం బతికి ఉంటుందని భావించడం. జలుబు దగ్గు ఏమైనా వస్తే.. కరోనా అనుకొని భయపడాల్సి రావడం.. బీర్ కారణంగా ముక్కుకారడానికి అవకాశం ఉందని ఫీలవడం.. వంటి కారణాలతోపాటు కరోనా వేళ స్వేచ్ఛగా బయటకు వెళ్లలేకపోవడం వంటివన్నీ కలిసి బీర్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. దీంతో.. హైదరాబాద్ పరిసరాల్లోని బీర్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 6 బీరు కంపెనీలు ఉండగా.. ఇప్పుడు నాలుగు మాత్రమే ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. అది కూడా ప్రొడక్ట్ తగ్గించేశాయి. మిగిలిన రెండు మాత్రం మూతవేసేయడం గమనార్హం.కరోనా లేనప్పుడు నెలకు 20 లక్షల కేసులు ఉత్పత్తి చేసిన కంపెనీలు ఇప్పుడు.. నాలుగైదు లక్షలు మాత్రమే ఉత్పత్తి చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చాలా కంపెనీలు మే నెల ముగిసిన తర్వాత ఉత్పత్తి ఆపేసి.. ఉన్న ప్రొడక్ట్ ను సేల్ చేసుకునే పనిలో పడ్డాయట. కంపెనీలు ఉత్పత్తి ఆపేయడంతో.. చాలా మంది ఉపాధి కోల్పోయినట్టు తెలుస్తుంది.

Related Posts