YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అక్కరకు వస్తున్న కిసాన్ రైలు

అక్కరకు వస్తున్న కిసాన్ రైలు

విజయనగరం, జూన్10, 
ఆరుగాలం కష్టం పడి పండించిన మామిడి పంటకు గిట్టుబాటు ధర దక్కని రైతులకు కిసాన్ రైలు అక్కరకు వస్తోంది. మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో పంటను అమ్ముకోవడానికి అన్నదాత దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్‌ రైలును ప్రారంభించింది. రవాణా ఛార్జీల్లో రూ.50శాతం రాయితీ కల్పించారు. వాస్తవానికి ఆ రాయితీ కూడా రైతులకు అందలేదు. గిటుబాటు ధరరాక, రవాణా రాయితీ లభించిక రైతన్న నిండా మునిగిపోతున్నాడు.. ప్రభుత్వం తమ గోస చూసైనా పంట కొనుగోలు చేసి ఆదుకోవాలని మామిడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.మామిడి ఉత్పత్తిలో రాష్ట్రంలో విజయనగరం జిల్లా మూడో స్థానం. సుమారు 1.10 లక్షల ఎకరాల్లో సువర్ణరేఖ, బంగినపల్లి, పనుకులు, పరియాలు, రసాలు, కోలంగోవ, కలెక్టేర్‌ తదితర రకాల మామిడి కాయలు సాగవుతున్నాయి. వీటిలో పనుకులు, పరియాలు, సువర్ణరేఖ, బంగినపల్లి అధికంగా సాగువుతుంది.గతేడాది ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోడంతో పూత దశలోనే నష్టం రావడంతో ఎకరాకు రెండు టన్నుల దిగుబడి వచ్చింది. తీరా పంటను అమ్ముకుందామనుకున్న సమయంలో కరోనా రెండోదశ వచ్చి పడింది. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ విధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఇదే అదునుగా భావించిన స్థానిక దళారులు తక్కువ ధరకు మామిడిని కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మామిడిరైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్‌రైలును ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని అజాపూర్‌ మార్కెట్‌కు పంటను తరలిస్తుంది. రవాణా ఛార్జీల్లో రూ.50 శాతం రాయితీని కల్పిస్తారు. ఏప్రిల్‌ నుంచి మే మొదటి వారం వరకు పదివేల మెట్రిక్‌ టన్నులు ఎగుమతి చేశారు. కానీ, కేంద్రం మే నెల రెండో వారంలో రవాణా రాయితీ ప్రకటించింది. దీనివల్ల అప్పటికే ఎక్కువ మంది రైతులు తమ సరుకును దళారులు విక్రయించారు. రవాణా ఛార్జీలు కూడా వారికే లభించాయి. ఇటు గిట్టుబాటు ధర లభించక, కేంద్రం ఇస్తున్న రవాణా ఛార్జీలు అందక అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. స్థానిక మార్కెటులు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.కరోనాను బూచిగా చూపి దళారులు రూ.1000 నుంచి రూ.1200 విలువ చేసే సువర్ణరేఖ 16 కేజీల బాక్సును రూ.800మించి కొనుగోలు చేయడం లేదు. మే నెల ఆరంభం నాటికి గరిష్టంగా రూ.500కు తగ్గించారు. రూ.1000 విలువ చేసే బంగినపల్లి ఏప్రిల్‌లో గరిష్టంగా రూ.600, మే నెలలో రూ.400కు తగ్గించి కొనుగోలు చేశారు. ఇక కోలంగోవ, కలెక్టర్‌ వంటి రకాలు విక్రయించే రైతులకు తిరిగి నష్టం వస్తుంది.నాలుగైదేళ్లగా నాతోపాటు మామిడి రైతులంతా నిలువ దోపిడీకి గురౌతున్నారు. సాగుతోపాటు పక్వానికి వచ్చిన కాయలు కోసి, వాటిని బాక్సుల్లో విక్రయించే క్రమంలో రూ.లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం. కానీ, స్థానికంగా మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో దళారులకు విక్రయించాల్సివస్తోంది. గతంలో కొంత నయం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50శాతం రవాణా ఛార్జీ వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానికంగా ప్రభుత్వ మార్కెట్‌ సదుపాయం కల్పించాలి.

Related Posts