YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

25 కేజీల గంజాయి, ఎక్సెల్ బైకు స్వాధీనం. గుట్కా, మట్కా, గంజాయి అమ్మకాల పై ప్రత్యేక దృష్టి

25 కేజీల గంజాయి, ఎక్సెల్ బైకు స్వాధీనం. గుట్కా, మట్కా, గంజాయి అమ్మకాల పై ప్రత్యేక దృష్టి

నెల్లూరు
ప్రజల ప్రాణాలకు హాని కల్గించే గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు,గుట్కా,మట్కా,గంజాయి అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలుతీసుకుంటామని వాకాడు సిఐ నరసింహ రావు హెచ్చరించారు.  కోట మండలం ,కోట గ్రామం శ్యామ సుందర పురం సాయి బాబా గుడి వద్ద, సుమారు 25కిలోల 405 గ్రాముల గంజాయిని కోట పోలీసులు పట్టుకున్నారు. గురువారం కోట పోలీస్ స్టేషన్లో సిఐ నరసింహ రావు, కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్ లు  పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ,ముద్దాయి లను మీడియా ముందు ప్రవేశ పెట్టి ,పూర్తి వివరాలు వెల్లడించారు.బుధవారం సాయంత్రం వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. నరసింహ రావు రాబడిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలు మేరకు కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్ పోలీసు సిబ్బంది తో కలిసి కోట మండలం ,కోట గ్రామం శ్యామసుందర పురం  సాయి బాబా గుడి వద్ద రోడ్డుపై సింగంశెట్టి కోటయ్య కు చెందిన పాడు బడిన రేకుల ఇంటికి వెనుకకు వెళ్లగా, సాయంత్రం 5 గంటల సమయం లో కోట గ్రామం ఆకుతోట దిబ్బ ప్రాంతానికి చెందిన ,ఏ1 సయ్యద్ అహ్మద్ బాషా, ఏ2 సయ్యదు బి బి జాన్ ,ఏ3 షేక్ వహిదా అను వారు నెంబర్ లేని నలుపు రంగు టి వి ఎస్ ఎక్స్ ఎల్ పక్కన 3 సంచులలో నిలబడి పోలీసులను చూసి తప్పించుకొనుటకు ప్రయత్నం చగా ,ఎస్సై వారిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 25 కేజీ ల 450 గ్రాములు కలిగిన 12 గంజాయి ప్యాకెట్లను టివి ఎస్ ఎక్స్ ఎల్ సదరు గంజాయి విలువ సుమారు రూ 2,50,000/- ఉంటుంది అని ఆయన తెలిపారు. అనంతరం దర్యాప్తు చేసి  ముగ్గురి పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అధిక డబ్బులు వస్తాయని ఆశతో ఎవరైనా గంజాయి, గుట్కాతోపాటు. కల్తీని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి చట్ట, సంఘ వ్యతిరేక చర్యలు పునరావృతం అయితే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలిస్తామన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా  గంజాయి,గుట్కా, మట్కాలు అక్రమ వ్యాపారం చేస్తూ ఉంటే ,పక్కఇంటి వారు కానీ,ఎవరూ అయినా పోలీసులకు సమాచారం అందిస్తే, తగు చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని సిఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట ఎస్సై బి బి మహేంద్ర నాయక్, ఏఎస్ ఐ షేక్  సిరాజ్,హెడ్ కానిస్టేబుల్ లు ఎం.వెంకటేశ్వర్లు, జి. సుబ్బా రావు,బి.మధు సూధన్, టి .సురేంద్ర మరియు సిబ్బంది అనుపమ,ఎం వి కృష్ణా రావు, సిహెచ్.కిరణ్, షేక్ జాకీర్ తదితరులు ఉన్నారు.

Related Posts