YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్*

*ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్*

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ రెండవ దశ తగ్గుముఖం పడుతున్న ఈ తరుణములో  కేంద్ర ప్రభుత్వం కోవిడ్ సోకిన వ్యక్తుల యొక్క  చికిత్స మరియు  నిర్వహణ పద్దతులకు  సంబందించి కొన్ని మార్పులు చేర్పులు చేసి కేంద్ర వైద్య ఆరోగ్య  మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా  విడుదల చేయడం జరిగింది.
దేశం లో ప్రస్తుతం ఉన్న కోవిడ్ రెండవ దశ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుండడం మనం గమనించవచ్చు. మొదటి రెండవ దశలో కోవిడ్ నిర్వహణకు సంబందించి అనేక రకాల అంశాలు  అనగా  వ్యక్తిని గుర్తించడం దగ్గర నుండి సమర్ధవంతమైన చికిత్స అందించి నిర్వహించడం వరకూ  చేపట్టిన కార్యక్రమాలు లో కొన్ని అంశాలు అనగా కోవిడ్ పట్ల అనుసరించవలసిన జాగ్రత్తలు, కోవిడ్ ని గుర్తించే పరీక్షలు, కోవిడ్ సోకిన వ్యక్తుల వర్గీకరణ, వ్యాధి తీవ్రత అనుసరించి అందించే చికిత్సా విధానాలు వంటివి ఆధారంగా తీసుకుని వాటికి మరిన్ని  మెరుగులు దిద్ది నిర్వహించడం ద్వారా రాబోయే కాలం లో వ్యాధి బారిన పడిన వారి సమయము మరియు డబ్బు వృధా కాకుండా మెరుగైన చికిత్స అందించే అవకాశం కలగడము తో పాటు వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సుళువు అవుతుందని భావించడం జరిగింది.
*ఆసింప్టోమాటిక్ కేసుల నిర్వహణ మరియు చికిత్స.*
కేంద్ర ప్రభుత్వ నూతనముగా విడుదల చేసిన మార్గ దర్శకాల ప్రకారం అనుమానితుడికి నిర్వహించిన RAT లేదా RTPCR  పరీక్ష లో ఫలితం ప్రతికూలంగా లేదా పరీక్షలో కనుగొన బడలేకపోవడం, లేదా  యాదృచ్ఛికంగా బయటపడడం, లేదా నిర్వహించిన 6 నిమిషాల నడక పరీక్ష లో రక్తం లో కొద్ది స్థాయి ఆక్సిజన్ సంతృప్తత తగ్గడం వంటితో పాటు ఎటువంటి జ్వరము, దగ్గు, గొంతు నొప్పి లేదా అసౌకర్యం, తల మరియు వంటి నొప్పులు, అనారోగ్యం నీరసం, విరోచనాలు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, తిప్పడం వికారం వాంతులు, రుచి మరియు వాసన కోల్పోవడం, శ్వాస పరమైన ఎటువంటి ఇబ్బందులు లేనివారు మరియు నిముషానికి ఊపిరి 12 నుండి 16 సార్లు, తో పాటు రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత 95 కి సమానంగా లేదా ఎక్కువ గల వారిని ఆసింప్టోమాటిక్ రోగులుగా వర్గీకరించడం జరిగింది. వీరికి హోమ్ ఐసోలేషన్ మరియు టెలీ కన్సల్టేషన్ సూచించడం జరిగింది. వీరి చికిత్స కు సంబందించి ఎటువంటి COVID-19  మందులు అవసరం లేదు అని సూచించడం జరిగింది. కానీ వీరికి ఉన్న ఇతర అనారోగ్యానికి సంబందించి సూచించిన మందులను వాడవచ్చు, రోగి కి  సమస్య ఏర్పడిన సందర్భాల్లో  టెలీ కన్సల్టేషన్ ద్వారా తగిన సూచనలు పొందాలి, రోగి తగిన మాస్కు, చేతి పరిశుభ్రత నిర్వహించాలి ఇతరులతో తగిన  శారీరక దూరం పాటించాలి, రోగి శరీరానికి తగినంత ద్రవాలు తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని అందించాలి. రోగులకు  కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఫోన్ మరియు వీడియో కాల్స్ ద్వారా వ్యాధి పట్ల సానుకూల చర్చలతో  తగినంత మనోబలాన్ని కలిగించాలి.  రోగి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయం లో ఉదయం 8.00 గంటలనుండి మొదలు ప్రతీ 4 గంటలకు  ఒకసారి వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, జ్వరము, శ్వాసక్రియ, పల్స్, బీపీ మరియు ఆక్సిజన్ సంతృప్తత గమనించి వాటి విలువలు చార్ట్ రూపములో నమోదు చేయాలి. అంతే కాకుండా ప్రతీ 6 లేదా 8 గంటలకు ఒకసారి 6 నిముషాల నడక పరీక్ష నిర్వహించి రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత విలువలు నమోదు చేసి అత్యవసర సందర్భాలు ఏర్పడినపుడు  రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఈ నడక పరీక్ష 70 సంవత్సరాలు దాటిన వృద్దులకు, ఆస్త్మా మరియు గర్భిణీ స్త్రీలకు నిర్వహించకూడదు.
*మైల్డ్ కేసుల(తేలిక పాటి కేసులు) నిర్వహణ మరియు చికిత్స*
కొద్ది పాటి జ్వరము, దగ్గు, గొంతు నొప్పి లేదా అసౌకర్యం, తల మరియు వంటి నొప్పులు, అనారోగ్యం నీరసం, విరోచనాలు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తో పాటు ఒక్కోసారి  తిప్పడం వికారం వాంతులు, రుచి మరియు వాసన కోల్పోవడం, మరియు  శ్వాస పరమైన ఎటువంటి ఇబ్బందులు లేనివారు,  మరియు నిముషానికి ఊపిరి 24 సార్లు, తో పాటు రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత 94  కి సమానంగా లేదా ఎక్కువ గల వారిని మైల్డ్ కేసులుగా వర్గీకరించడం జరిగింది. వీరికి హోమ్ ఐసోలేషన్ లేదా  కోవిడ్ కేర్ సెంటర్ ను సూచించడం జరిగింది. వీరికి ఏ ఇతర నిర్దిష్ట COVID-19 మందులు అవసరం లేదని సూచించబడింది. రోగి తగిన మాస్కు, చేతి పరిశుభ్రత, దగ్గు వచ్చే  సందర్భాలలో తగిన మర్యాద తో పాటు  ఇతరులతో తగిన  శారీరక దూరం పాటించాలని సూచించడం జరిగింది, రోగి శరీరానికి తగినంత ద్రవాలు తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని అందించాలి. రోగులకు  కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఫోన్ మరియు వీడియో కాల్స్ ద్వారా వ్యాధి పట్ల సానుకూల చర్చలతో  తగినంత మనోబలాన్ని కలిగించాలి.  జ్వరం, శ్వాస క్రియ మరియు రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత ను ఎప్పటికప్పుడు స్వీయ పర్యవేక్షణ నిర్వహించి ఏదైనా తీవ్ర లక్షణాలు కనుగొన్న సందర్భాల్లో  సూచించిన విధంగా ప్రతిస్పందించాలి. రోగికి ఉపశమనం కొరకు  యాంటీ-పైరెటిక్ మరియు యాంటీ-టుస్సివ్ మందులు సూచించబడ్డాయి. దగ్గు కు సంబందించి బుడెసోనైడ్ 800 mcg BD డోస్ 5 రోజులు పాటు  మీటర్ ఇన్‌హేలర్ తో పాటు అవసరమైన సందర్భాల్లో ఆక్సిజన్ చికిత్స సూచించబడింది.
*మోడరేట్ కేసుల (తక్కువ స్థాయి తీవ్ర లక్షణాలు) నిర్వహణ మరియు చికిత్స.*
ఊపిరి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసకోశ రేటు 24 కన్నా ఎక్కువ మరియు  30 కన్నా తక్కువ,    గది లో  SpO2 సంతృప్తత 90-93% తో పాటు జ్వరము, దగ్గు, గొంతు నొప్పి లేదా అసౌకర్యం, తల మరియు వంటి నొప్పులు, అనారోగ్యం నీరసం, విరోచనాలు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తో పాటు  తిప్పడం వికారం వాంతులు, రుచి మరియు వాసన కోల్పోవడం, మరియు  శ్వాస పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని మోడరేట్ కేసులుగా వర్గీకరించడం జరిగింది. వీరికి డేడికేటెడ్ కోవిడ్ కేర్ హెల్త్ సెంటర్ లేదా కోవిడ్ హాస్పిటల్ ను  సూచించడం జరిగింది. వీరికి తగిన మాస్కు, చేతి పరిశుభ్రత, దగ్గు వచ్చే  సందర్భాలలో తగిన మర్యాద తో పాటు  ఇతరులతో తగిన  శారీరక దూరం పాటించాలని సూచించడం జరిగింది, రోగికి ఉపశమనం కొరకు  యాంటీ-పైరెటిక్ మరియు యాంటీ-టుస్సివ్ మందులు సూచించబడ్డాయి. వీటితో పాటు SpO2 సంతృప్తత 92% -95% మధ్య ఉండడానికి టైట్రేట్ చేయబడిన ఆక్సిజన్ మద్దతు ఇవ్వవలసిన ఉంటుంది. ఊపిరి తిత్తుల వ్యాధి ముదిరి శ్వాస తీసుకోలేని మరియు హైపోక్సియా సందర్భం లో తీవ్రత అనుసరించి తగిన ఆక్సిజన్ పరికరాలతో మద్దతు ఇవ్వవలసిన ఉంటుంది. డయాబెటిస్ వంటి సహ-అనారోగ్య పరిస్థితులను  నియంత్రణలో పెట్టాలి, రక్తం లో  SpO2 92% కంటే క్రింద ఉన్న సందర్భాల్లో  స్టెరాయిడ్స్ ఇవ్వాలి, ఊపిరితిత్తుల యొక్క పని తీరు మెరుగు పడడానికి సూచించిన విధంగా ప్రోనింగ్ పొజీషన్ నిర్వహించాలి. 
బేస్ లైన్ పరిశోధనలు అయిన  CBC, Blood Glucose, urine routine, LFT, KFT, CRP, S. Ferritin, D-DIMER, LDH, CPK గురించి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి వచ్చిన ఫలితాలు అనుసరించి పరిశోధనల కోసం CRP and D-DIMER 48 to 72 hourly; CBC, KFT, LFT 24 to 48 hourly; IL-6 స్థాయిలు క్షీణించినట్లయితే లభ్యతకు లోబడి, ICU సెట్టింగులలో తరచుగా పునరావృతం, కనీసం 48 గంటల వ్యవధిలో సీరియల్ CXR చేయవలసి ఉంటుంది. లక్షణాలు తీవ్రమవుతున్న సందర్బాల్లో మాత్రమే ఛాతీని  HRCT నిర్వహించాలి.  బేస్ లైన్ మరియు నిర్వహించిన పరిశోధనలు అనుసరించి తదుపరి చికిత్స కు  స్టెరాయిడ్లు, యాంటీ కోగ్యులెంట్స్ యొక్క రోగనిరోధక మోతాదు LMWH లేదా అన్‌ఫ్రాక్టేటెడ్ హెపారిన్ రోగనిరోధక మాడ్యులేటర్ లు మార్గనిర్దేశనం చేయబడతాయి.
*సివియర్‌ కేసుల (తీవ్ర లక్షణాలు) నిర్వహణ మరియు చికిత్స*
ఊపిరి మరియు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, శ్వాసకోశ రేటు 30 కంటే ఎక్కువ,    ఊపిరి తిత్తుల వ్యాధి ముదిరి శ్వాస తీసుకోలేని సందర్భం కాకుండా గది వాతావరణములో లో  SpO2 సంతృప్తత 90% కంటే తక్కువతో పాటు తీవ్రమైన జ్వరము, దగ్గు, గొంతు నొప్పి లేదా అసౌకర్యం, తల మరియు వంటి నొప్పులు, అనారోగ్యం నీరసం, విరోచనాలు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు తో పాటు  తిప్పడం వికారం వాంతులు, రుచి మరియు వాసన కోల్పోవడం, మరియు  శ్వాస పరమైన ఇబ్బందులు పడుతున్న వారిని సివియర్‌ కేసులుగా  వర్గీకరించడం జరిగింది. వీరికి కోవిడ్ హాస్పిటల్ లోని  ICU చికిత్స కు  సూచించడం జరిగింది వీరికి తక్షణమే 5 L / Min తో  కూడిన ఆక్సిజన్ చికిత్స ప్రారంభించవలసి ఉంటుంది. గర్భిణీయే తర మరియు  పెద్దలలో 90% మరియు గర్భిణీ రోగులలో 92-96% లక్ష్యాన్ని చేరుకోవడానికి టైట్రేషన్ కలిగిన  ఆక్సిజన్ చికిత్స ప్రారంభించవలసి ఉంటుంది. రోగి యొక్క పెరుగుతున్న ఆక్సిజన్ అవసరం అనుసరించి IV NIV  లభ్యతను బట్టి హెల్మెట్ లేదా ఫేస్ మాస్క్ ఇంటర్‌ఫేస్ యొక్క వాడకాన్ని పరిగణించండి. IV NIV తో రోగి పరిస్థితి మెరుగుపడకపోతే హై ఫ్లో HFNC వాడకాన్ని పరిగణించాలి. సూచించిన పై రెండు విధానాల ద్వారా రోగి పరిస్థితి మెరుగుపడక శ్వాస క్రియ సరిగా పని చేయని సందర్భం లో  ఇంట్యూబేషన్ నిర్వహించి  మెకానికల్ వెంటిలేషన్ ను  పరిగణించాలి. తదుపరి డ్రగ్ థెరపీ వివరాలలో సూచించిన విధముగా స్టెరాయిడ్ చికిత్సను ప్రారంభించాలి. బేస్ లైన్ పరిశోధనలు అయిన  CBC, Blood Glucose, urine routine, LFT, KFT, CRP, S. Ferritin, D-DIMER, LDH, CPK గురించి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి వచ్చిన ఫలితాలు అనుసరించి పరిశోధనల కోసం CRP and D-DIMER 48 to 72 hourly; CBC, KFT, LFT 24 to 48 hourly; IL-6 స్థాయిలు క్షీణించినట్లయితే లభ్యతకు లోబడి, ICU సెట్టింగులలో తరచుగా పునరావృతం, కనీసం 48 గంటల వ్యవధిలో సీరియల్ CXR చేయవలసి ఉంటుంది. లక్షణాలు తీవ్రమవుతున్న సందర్బాల్లో మాత్రమే ఛాతీని  HRCT నిర్వహించాలి. బేస్ లైన్ మరియు నిర్వహించిన పరిశోధనలు అనుసరించి తదుపరి చికిత్స కు  యాంటీ కోగ్యులెంట్స్ యొక్క రోగనిరోధక మోతాదు LMWH లేదా UFH ఉదా. ఎనోక్సపారిన్ 40 mg S / C గా  రోజు ఇవ్వాలి. క్లినికల్ పరిశీలనలు ఆధారంగా యాంటి కోగ్యులెంట్లు కూడా నిర్వహించబడాలి.
*భారత దేశ ఔషధ నియంత్రణ చట్టాలు  అనుసరించి కొన్ని నిర్దిష్ట  పరిస్థితులు మరియు    అందుబాటులో ఉన్న పరిమిత ఆధారాల ఆధారంగా ఆఫ్ లేబుల్ వాడకముగా సూచించబడిన మందులు.*
*రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ వినియోగమునకు  సూచించిన  మార్గదర్శకాలు*
1. రెమ్‌డెసివిర్ అనేది ప్రపంచవ్యాప్తంగా లభించిన  పరిమిత శాస్త్రీయ ఆధారాల ఆధారంగా మాత్రమే అత్యవసర వినియోగ అధికారం కింద DCG (I) చేత ఆమోదించబడిన ఔషధం. అది వ్యాధి ప్రారంభమైన 10 రోజుల లోపు మితమైన లేదా  తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సహాయంతో  ఉన్న ఎంపిక చేసిన COVID-19 రోగులలో మాత్రమే ఉపయోగించబడుతుంది.
2. హోం ఐసోలేషన్ మరియు కోవిడ్ సంరక్షణ కేంద్రాలలో ఉన్న తేలికపాటి COVID-19 రోగులకు  ఇది సూచించబడలేదు.
3. రెమ్‌డెసివిర్ వాడే సందర్భం లో  వైద్యులు అత్యంత  జాగ్రత్త వహించాలని సూచించడం జరిగింది. ఎందుకంటే ఇది హాని కలిగించి ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఔషధం.
సరైన అనుమతి లేకుండా  రెమ్‌డెసివిర్ యొక్క వాడకం మరియు దుర్వినియోగాన్ని అరికట్టడానికి  ఈ క్రింది అదనపు సూచనలు  సిఫార్సు చేయబడ్డాయి:
a. రోగి చికిత్స లో ప్రత్యక్షంగా పాల్గొనే సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మరియు నిపుణులు సూచించే సలహా ప్రకారము వాడవలసి ఉంటుంది.
b. అత్యవసర సమయాల్లో రెమ్‌డెసివిర్ నిర్వహించవలసిన సందర్భాలు ఏర్పడితే  డ్యూటీ డాక్టర్ రోగి సంబంధిత నిపుణుడు / యూనిట్ ఇన్ – ఛార్జ్  సీనియర్ ఫ్యాకల్టీతో టెలిఫోనిక్ సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే నిర్వహించాలి.
c. రెమ్‌డెసివిర్ ని సూచించిన సదరు సలహా నివేదన మీద తప్పనిసరిగా సంబంధిత వైద్యుడి పేరు వ్రాయాలి సంతకం మరియు స్టాంప్‌ను కలిగి ఉండాలి.
d. దీనికి సంబందించి ప్రతి ఆసుపత్రిలో  స్పెషల్ డ్రగ్ కమిటీ ఎస్‌డిసి ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, ఈ డ్రగ్ కమిటీ వారి ఆసుపత్రిలో రెమ్‌డెసివిర్ వాడకాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఇది ఉంటుంది. ఆసుపత్రిలో ఫార్మకాలజీ ప్రొఫెసర్ / ఫ్యాకల్టీని అందుబాటులో ఉన్న చోట వారిని  ఎస్‌డిసి సభ్యునిగా నియమించడం మంచిది.
e. రెమెడిసివిర్ యొక్క హేతుబద్ధమైన మరియు న్యాయమైన వాడకాన్ని నిర్ధారించడానికి స్పెషల్ డ్రగ్ కమిటీ వారి పరిశోధనలను ఎప్పటికప్పుడు వైద్యులతో పంచుకోవాలి.
f. దీనిని ఆస్పత్రులు మాత్రమే సేకరించి అందించాలి. రోగి యొక్క సహాయకులను మరియు  బంధువులను  రెమ్‌డెసివిర్‌ ను రిటైల్ మార్కెట్ నుండి సేకరించమని వాళ్ళని  అడగకూడదు చెప్పకూడదు.
*టోసిలిజుమాబ్ Tocilizumab వినియోగమునకు  సూచించిన  మార్గదర్శకాలు*
టోసిలిజుమాబ్ అనేది ఒక రోగనిరోధక మందు. COVID-19 తో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో బాధపడే యొక్క రోగులకు కింది తెలిపిన అత్యవసరమైన సందర్భాల్లో  మాత్రమే ఇది ఆఫ్-లేబుల్ ఔషధంగా ఉపయోగించడానికి DCG (I) చేత ఆమోదించబడింది.
స్టెరాయిడ్లు వాడిన  24-48 గంటల తర్వాత కూడా రోగి యొక్క  ఆక్సిజన్ స్థాయిలలో మెరుగుదల సంకేతాలను చూపించని సందర్భాలు మరియు సి-రియాక్టివ్ ప్రోటీన్ ≥75 mg / L పెరుగుదల వలన ఏర్పడే  ఇన్ఫ్లామేషన్ యొక్క గణనీయ మైన  గుర్తుల సందర్భం లో. రోగి కి టోసిలిజుమాబ్ నిర్వహించే సందర్భం లో అతనికి ఎటువంటి బ్యాక్టీరియా / ఫంగల్ / ట్యూబర్‌క్యులస్ ఇన్‌ఫెక్షన్ లేదని నిర్ధారించు కోవాలి. మోతాదు: వ్యక్తి శరీర బరువు అనుసరించి కేజీ శరీర బరువు 8 మి.గ్రా చొప్పున (మొత్తం 800 మి.గ్రా కంటే ఎక్కువ మించకూడదు)100 మి.లీ సాధారణ సెలైన్‌లో ఒక గంట సమయానికి మించి నిర్వహించాలి.
*స్టెరాయిడ్స్ మరియు యాంటీ కోగ్యులెంట్స్ వినియోగమునకు  సూచించిన  మార్గదర్శకాలు*
లక్షణ రహిత మరియు తేలికపాటి కేసులలో COVID-19 యొక్క చికిత్స లో స్టెరాయిడ్లు సూచించబడవు మరియు అలాంటి వ్యక్తులకు అవి వాడడము  హానికరం. మధ్యస్థంగా మరియు తీవ్రమైన అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన COVID-19 కేసులకు  మాత్రమే స్టెరాయిడ్లు వాడకము  సూచించబడతాయి. స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో మరియు సరైన వ్యవధిలో వాడవలసి ఉంటుంది మరియు స్టెరాయిడ్లను వైద్యుని సలహా లేకుండా స్వయముగా వాడకూడదు. సిఫార్సు చేయబడిన మోతాదు రోగి యొక్క రోజువారీ క్లినికల్ ఆధారంగా డేక్సామెతాసోన్ 6 ఎంజి ను రోజుకు  ఒకసారి IV ద్వారా లేదా నోటి ద్వారా వ్యాధి ప్రారంభం నుండి 10 రోజులు లేదా డిశ్చార్జ్  సమయం వరకు ఏది ఏది ముందు ఐతే అది  వరకూ అందించాలి. ఒక వేళ డేక్సామెతాసోన్ అందుబాటులో లేకపోతే, దానికి సమానమైన గ్లూకోకార్టికాయిడ్ మోతాదు తో మిథైల్ప్రెడ్నిసోలోన్ 32 mg నోటి ద్వారా  లేదా 40 mg ను I V ద్వారా, లేదా 50 mg హైడ్రోకార్టిసోన్ I V ద్వారా ప్రతి 8 గంటలకు లేదా ప్రెడ్నిసోన్ 40 mg నోటి ద్వారా  ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. స్టెరాయిడ్‌ లను వినియోగించే రోగులందరి రక్తంలో గ్లూకోజ్ యొక్క  పర్యవేక్షణ తప్పనిసరి. స్టెరాయిడ్‌ లను వినియోగించే రోగులకు ఇది హైపర్గ్లైకేమియాను కలిగిస్తుంది. ఏది ఏమైనా  COVID-19 సంక్రమణ కు గురయ్యి  చికిత్స లో భాగముగా స్టెరాయిడ్‌ లను వినియోగించిన సాధారణ వ్యక్తులలో అది మధుమేహానికి దారితీస్తుంది,  లేదా ఆల్ రెడీ  మధుమేహము ఉన్న రోగుల పరిస్థితులను  మరింత దిగ జార్చే అవకాశం ఉంటుంది. స్టెరాయిడ్లు వైరల్ షెడ్డింగ్‌ను పొడిగిస్తాయని  గుర్తుంచుకోవాలి, అందువల్ల వీటి వాడకములో మరింత  జాగ్రత్త అవసరం. 
*యాంటీ కోగ్యులెంట్ల వాడకానికి సూచించిన మార్గదర్శకాలు*
తీవ్రమైన కేసుల నిర్వహణ లో COVID-19 తీవ్ర లక్షణాలతో బాధ పడే సందర్భాలలో రోగనిరోధక అన్-ఫ్రాక్షనేటెడ్ హెపారిన్ లేదా తక్కువ మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అయిన ఉదా., ఎనోక్సపారిన్ రోజుకు 0.5 mg / kg SC OD). మోతాదులో వాడాలి. ఇది నిర్వహించే సమయము లో  రోగులలో అధిక రక్త స్రావం మరియు ప్రమాద తీవ్రత అధికముగా ఉండకూడదు. అత్యంత తీవ్రమైన కేసులలో COVID-19 తీవ్ర లక్షణాలతో బాధ పడుతూ థ్రోంబోఎంబోలిజానికి ఆధారాలు ఉన్న సందర్భాలలో రోగనిరోధక అన్-ఫ్రాక్షనేటెడ్ హెపారిన్ లేదా తక్కువ మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అయిన ఉదా., ఎనోక్సపారిన్ రోజుకు 0.5 mg / kg SC OD). మోతాదులో వాడాలి. ఇది నిర్వహించే సమయము లో  రోగులలో అధిక రక్త స్రావం మరియు ప్రమాద తీవ్రత అధికముగా ఉండకూడదు. 
*HRCT ఇమేజింగ్ నిర్వహణకు సూచించబడిన విధివిధానాలు.*
COVID-19 ఉన్న రోగులకు CT (HRCT) స్కాన్ నిర్వహించినపుడు ఛాతీ యొక్క హై-రిజల్యూషన్ దృశ్యాలలో ఊపిరితిత్తులలో వ్యాధి ప్రమేయం దాని విస్తృతి మరియు స్వభావాన్ని బాగా దృశ్యమానం చేస్తుంది. ఏదే మైనా HRCT ద్వారా పొందిన  ఛాతీ యొక్క అదనపు సమాచారం చికిత్స నిర్ణయాలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం చికిత్స కు సంబందించి నిర్ణయాలు దాదాపు పూర్తిగా వ్యాధి  తీవ్రత మరియు శారీరక బలహీనతపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల  చికిత్స  చేసే వైద్యులకు COVID-19 రోగుల ఛాతీ యొక్క HRCT ఇమేజింగ్‌కు  ఆదేశించడం ఒక ఎంపికగా ఉండాలి. ప్రతీ COVID-19 రోగిని  ఛాతీ యొక్క సాధారణ HRCT ఇమేజింగ్ కు ఎందుకు సిఫార్సు చేయబడదు? COVID-19 ప్రభావానికి గురయ్యి ఎటువంటి లక్షణం లేని వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది HRCT ఛాతీ ఇమేజింగ్‌లో అస్పష్టమైన అసాధారణాలు కనుగొనడం జరిగింది. వాటిలో ఎక్కువ భాగం వైద్య పరంగా పురోగతి లేదు. అనారోగ్యం మొదలు అయ్యాక  మొదటి వారంలో నిర్వహించిన  ఛాతీ యొక్క HRCT ఇమేజింగ్ తరచుగా ఊపిరితిత్తుల ప్రమేయం యొక్క పరిధిని తక్కువగా అంచనా వేస్తుంది, రక్షణ పరంగా తప్పుడు అంచనాలు ఇస్తుంది. ఛాతీ యొక్క HRCT ఇమేజింగ్ ద్వారా ఊపిరితిత్తుల ప్రమేయం యొక్క పరిధి మరియు హైపోక్సియా మధ్య పరస్పర సంబంధం అసంపూర్ణమైనది. తరచుగా, విస్తృతమైన ఊపిరితిత్తులు ప్రమేయం ఉన్న యువకులలో హైపోక్సియాను  అభివృద్ధి చేయదు, అయితే తక్కువ విస్తృతమైన ఊపిరితిత్తుల ప్రమేయం ఉన్న వృద్ధులు హైపోక్సియాను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. తరచుగా నిర్వహించే  HRCT ఇమేజింగ్ కారణంగా రేడియేషన్ ఎక్స్పోజర్ కు బాగా గురయ్యి తరువాత జీవితంలో వారు క్యాన్సర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఛాతీ యొక్క HRCT ఇమేజింగ్ చేయకూడని పరిస్థితులు కోవిడ్ -19 సంక్రమణ ను నిర్ధారించడానికి లేదా  పరీక్షించడానికి ఛాతీ ని HRCT స్కాన్ చేయకూడదు. ICMR సిఫారసు చేసినట్లు ఆమోదించబడిన ప్రయోగశాల పరీక్షలను ఉపయోగించడం ద్వారా మాత్రమే కోవిడ్ -19 నిర్ధారణ చేయాలి. ఎటువంటి లక్షణం లేని మరియు తేలికపాటి COVID-19 యొక్క కేసులలో ఇది సూచించబడదు. హైపోక్సియా మరియు అసాధారణమైన ఛాతీ రేడియో గ్రాఫ్ ఉన్న COVID-19 రోగులలో చికిత్సను ప్రారంభించడానికి ఛాతీ కి  HRCT స్కాన్ నిర్వహించ అవసరం లేదు. అందించిన చికిత్సకు ప్రతిస్పందనను అంచనా వేయడానికి ఛాతీ కి  HRCT స్కాన్ నిర్వహించ అవసరం లేదు. చికిత్స పరంగా  మెరుగుదల ఉన్నప్పటికీ ఊపిరితిత్తుల గాయాలు రేడియో లాజికల్ పురోగతిని చూపుతాయి. 
COVID-19 రోగులలో ఛాతీ యొక్క HRCT ఇమేజింగ్ నిర్వహణ కు తగిన సూచనలు:
మితమైన మరియు అనుమానాస్పద ధృవీకరించబడిన COVID-19 యొక్క కేసులు, ప్రత్యేకించి తగిన చికిత్సను ప్రారంభించిన తర్వాత కూడా వైద్య పరంగా క్షీణిస్తూనే ఉన్నా మరియు ఇన్వాసివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు ఛాతీ కి  HRCT స్కాన్ నిర్వహించాలి. రోగికి చికిత్స అందించే  వైద్యుడు లేదా  ఇంటెన్సివిస్ట్ రోగి యొక్క క్లినికల్ అసెస్‌మెంట్‌ను బట్టి ఛాతీని HRCT కి  పరిగణించవచ్చు. పైన పేర్కొన్నదాని ప్రకారం, చికిత్స చేసే వైద్యులు ఛాతీ యొక్క HRCT ఇమేజింగ్‌కు సలహా ఇచ్చే ముందు తగిన  జాగ్రత్త వహించాలి. 
*ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ నిర్వహణ విధానాలు.*
ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఒక ఫంగల్ వ్యాధి. గాలి లో ఉన్న  శిలీంద్ర బీజాంశాలను పీల్చడం ద్వారా ఇది సంక్రమిస్తుంది.  ఇది ప్రబలమైన డయాబెటిస్ మెల్లిటస్, స్టెరాయిడ్ల అధిక వినియోగం, ప్రాణాంతక సందర్భాలో జరిగిన అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి కాదు.  సాధారణంగా COVID-19 యొక్క లక్షణాలు ప్రారంభమైన 3 వ వారంలో ఇది సోకే అవకాశాలు ఉంటాయి. COVID-19 రోగులలో ముకోర్మైకోసిస్ పెరగడానికి కారణాలు
1. ఏ కారణం చేతనైన ఏర్పడే  అనియంత్రిత హైపర్గ్లైసీమియా వలన.
2. స్టెరాయిడ్ల దుర్వినియోగం, అధిక వినియోగం మరియు అహేతుక ఉపయోగం.
3. ఐసియు లో ఎక్కువ కాలం ఉండడం, అపరిశుభ్రమైన మరియు తేమ వాతావరణం, యాంటీబయాటిక్స్ యొక్క విస్తృత వాడకం, అహేతుక ఉపయోగం ముకోర్మైకోసిస్‌తో సంబంధం కలిగి ఉండవచ్చు
4. హేమాటోలాజికల్ ప్రాణాంతక, రోగనిరోధక మందుల వాడకం, అవయవ మార్పిడి చికిత్స  మరియు  సహ-అనారోగ్యాలు తో ఉన్న వ్యక్తులు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు మరియు  సంకేతాలు:
1. ముఖములో, సైనసెస్‌, దంతాలు మరియు చిగుళ్లలో నొప్పి
2. పారాస్తేసియా / ముఖం లో సగం కంటే ఎక్కువ ప్రాంతం మెద్దుబారటం.
3. నాసోలాబియల్ గాడి మరియు  నాసి మీద చర్మం నల్లగా మారడం.
4. నాసికా క్రస్టింగ్ మరియు నాసికా స్రావాలు నల్లగా లేదా రక్తం రంగులో ఉంటుంది.
5. కండ్లకలక అంటువ్యాధి  లేదా కెమోసిస్.
6. పెరియర్బిటల్ వాపు.
7. డిప్లోపియా లేదా అస్పష్టత దృష్టి.
8. దంతాల వదులు
9. అంగిలి పాలిపోవడం / అంగిలి నల్లగా మారడం.
10. శ్వాసకోశ లక్షణాలు, హిమోప్టిసిస్, తీవ్ర ఛాతీ నొప్పి, తలనొప్పి, స్పృహ లో  మార్పులు  మరియు మూర్ఛలు మొదలైనవి.
రోగ నిర్ధారణ విధానం.
KOH మౌంట్ మరియు మైక్రోస్కోపీ, మరియు వ్యాధి సోకిన కణజాలం యొక్క హిస్టోపాథాలజీ (అస్ప్టేట్ హైఫే వంటి రిబ్బన్ ఉనికి 5-15 µ మందపాటి ఆ శాఖను లంబ కోణాల్లో). పరీక్షలు నిర్వహించి ఫలితాల కోసం వేచి ఉండకుండా ముకోర్మైకోసిస్ అత్యవసర పరిస్థితి కాబట్టి వెంటనే చికిత్స ప్రారంభించాలి. సైనసెస్ యొక్క రేడియో లాజికల్ ఇన్వెస్టిగేషన్స్ కొరకు సంబంధిత CT,  అనుమానాస్పద పల్మనరీ ప్రమేయం కోసం ఛాతీ CT (10 కంటే ఎక్కువ నోడ్యూల్స్, రివర్స్ హాలో సైన్, CT బ్రోంకస్ సైన్, ప్లూరల్ ఎఫ్యూషన్-మ్యూకోర్ యొక్క అధిక సూచిక), వ్యాధి యొక్క ప్రమేయం పరిధిని చూడటానికి మెదడు ను MRI నిర్వహించడం మొదలైనవి. 
బ్లాక్ ఫంగస్ నిర్వహణ విధానాలు.
పైన పేర్కొన్న విధంగా ముందస్తు లక్షణాలు అధికంగా ఉండి ఇన్వాసివ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పరిస్థితుల సమక్షంలో ముకోర్మైకోసిస్  యొక్క అనుమాన సూచీ  అధికమూ గా ఉండాలి. ఈ వ్యాధికి సకాలములో అందించే చికిత్స మరణాలను తగ్గిస్తుంది. వ్యాధి నిర్వహణకు అనేక విభాగాల శస్త్ర చికిత్స నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీం విధానం అనేది అవసరము. ముకోర్మైకోసిస్ చికిత్సలో  వ్యాధికి గురయిన భాగమును శస్త్రచికిత్స తో తీసివేయడం  మరియు యాంటీ ఫంగల్ థెరపీ కలయిక ఉంటుంది. ప్రారంభ మోతాదు గా వ్యక్తి యొక్క శరీర బరువు అనుసరించి 5mg / kg చొప్పున  లిపోసోమల్ యాంఫోటెరిసిన్ B (CNS ప్రమేయం విషయంలో 10 mg / kg body wt) చికిత్స కు  ఎంపిక చేయాలి. దీన్ని  5% డెక్స్ ట్రోజ్ లో  కరిగించాలి అది సాధారణ సెలైన్ / రింగర్ లాక్టేట్‌ కి  విరుద్ధంగా ఉండి సుమారు  2-3 గంటలకు పైగా నిర్వహించాలి  మరియు మొదటి రోజు నుండి పూర్తి మోతాదుతో ప్రారంభించాలి. మూత్రపిండాల పనితీరు మరియు సీరం పరీక్షల పర్యవేక్షణ కోసం ఎలెక్ట్రోలైట్స్ సిఫార్సు చేయబడింది. చికిత్స తో అనుకూలమైన ప్రతిస్పందన సాధించే వరకు మరియు వ్యాధి స్థిరీకరించబడే వరకు ఈ విధానం  కొనసాగించాలి, ఇది 3లేదా 6 వారాలు పట్టవచ్చు.  తరువాత నోటి ద్వారా పోసాకోనజోల్ 300 మి.గ్రా టాబ్లెట్లు  రోజుకు రెండుసార్లు చొప్పున, లేదా ఇసావుకోనజోల్ 200 మి.గ్రా  టాబ్లెట్ రోజుకు 3 సార్లు చొప్పున 2 రోజుల పాటు,  లేదా వైద్యుడి సలహా సూచన ప్రకారం సుదీర్ఘకాలం వాడాలి. సంక్రమణ సంకేతాలు మరియు లక్షణాల చికిత్స ఫలితాలు,  అలాగే వ్యాధి  క్రియాశీల ప్రమాద కారకాలు హైపర్గ్లైసీమియా, ఇమ్యునోసప్ప్రెషన్ మొదలైన వాటి  యొక్క పరిష్కారం మరియు రేడియో లాజికల్ సంకేతాలు  అనుసరించి చికిత్స కొనసాగించాలి, మరియు ఇది చాలా కాలం పాటు ఇవ్వవలసి ఉంటుంది. లిపోసోమల్ అందుబాటులోని సందర్భాలలో  సాంప్రదాయ యాంఫోటెరిసిన్ B (డియోక్సీ చోలేట్) 1-1.5mg / kg మోతాదులో ఉపయోగించవచ్చు. చికిత్స  నిర్వహణ కాలంలో కిడ్నీ పనితీరుని  పర్యవేక్షించాలి.
*************"**""************
*డాక్టర్ ఆర్జా శ్రీకాంత్*
స్టేట్ కో విద్  నోడల్ ఆఫీసర్

Related Posts