YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

డెల్టా వేరియంట్ పై చర్చ

డెల్టా వేరియంట్ పై చర్చ

న్యూఢిల్లీ, జూన్ 11, 
కరోనా వేరియంట్లలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. సెకండ్ వేవ్ ఎక్కువ ఇబ్బందికి గురి చేయడానికి కారణం ఈ డెల్టా వేరియంట్ అని నమ్ముతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన డెల్టా వేరియంట్, భారతదేశం మీద తన పంజా విసిరింది. యూకేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే ఇది ప్రాణాంతకమని తెలిపింది.వినికిడి లోపాలు, గ్యాస్ సంబంధిత వ్యాధులు, రక్తం గడ్డకట్టడం మొదలగు లక్షణాలు ఈ డెల్టా వేరియంట్ కారణంగా వస్తున్నాయని భావన. ఇప్పటి వరకూ మొత్తం 60దేశాల్లో ఈ డెల్టా వేరియంట్ ని గుర్తించారు. యూకేలో డెల్టా వేరియంట్ కారణంగానే ఆస్పత్రుల పాలవడం జరిగిందని చెబుతున్నారు.భారత ప్రభుత్వ అధ్యయనం ప్రకారం డెల్టా వేరియంట్ విస్తరణ చాలా వేగంగా ఉంటుంది. ఆల్ఫా వేరియంట్ కంతే 50శాతం వేగంగా ఇది విస్తరిస్తుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని, ఇప్పుడప్పుడే పూర్తిస్థాయి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు.గతంలో ఎలాంటి సమస్యలు లేని వారికి కూడా డెల్టా వేరియంట్ కారణంగా రక్తం గడ్డ కట్టడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఈ కారణంగా కడుపు నొప్పి సంబంధ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ పెద్దల్లోనే కాదు చిన్నపిల్లలపై కూడా దాని ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం అది పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సెకండ్ వేవ్ లో ఇంట్లో ఉన్న వారందరికీ కరోనా రావడం ఎక్కువైంది. మొదటి వేవ్ లో కరోనా ప్రభావం ఇంతలా లేదు. దీన్నిబట్టి డెల్టా వేరియంట్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Related Posts