YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పెట్రోల్ ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్

పెట్రోల్ ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్

జగిత్యాల జూన్ 11,

పెట్రోల్ ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్ తాళ్లతో ఆటోను లాగి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసన కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసనలో తీవ్ర ఉద్రిక్తత అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు పోలీసులకు నాయకుల మధ్య వాగ్వాదం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి స్వల్ప ఆశ్వస్థత ,యూత్ కాంగ్రెస్ నేతలకు గాయాలు పోలీసుల వైఖరిని ఖండించిన ఎమ్మెల్సీ.
పెట్రోలు ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాలలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల యువ నేతలు హాజరయ్యారు. నిరసన ప్రదర్శనలో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు తాళ్లతో ఆటోను లాగుతూ వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవన్ రెడ్డి ఇంటి నుంచి నాయకులు తహశీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతుండగానే పోలీసులు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేస్తుండగా నాయకులు అడ్డుకోవడంతో నాయకులు, పోలీసుల మధ్యాతోపులట జరిగింది. దీంతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధుతో రఘువీర్ గౌడ్ కు గాయాలు అయ్యాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురికాగా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. 200 మంది నాయకులు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీసుకు తరలించారు.దీంతో  జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల కాకుండా అనేక రంగాలపై భారం పడుతుందని, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి బండ శంకర్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయ లక్ష్మీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, నాయకులు గుంటి జగదీశ్వర్, ముకేశ్ గౌడ్, గుండా మధు,విజయ్ ,నేహాల్, శంకర్, శరత్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అధిక పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి 
ఏఐసీసీ ఆదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పిలుపు మేరకు,  కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ కోరుట్ల పట్టణంలోని పెట్రోల్ పంపుల ఎదుట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు తిరుమల గంగాధర్ మాట్లాడుతూ కెసిఆర్ మరియు మోదీ  ప్రభుత్వాలు కుమ్మక్కై లీటర్ పెట్రోలు ధర వందకు పైగా పెంచి సామాన్య ప్రజల జేబులు కొల్లగొట్టడంలో జేబుదొంగలను మించిపోయారని తిరుమల గంగాధర్ విమర్శించారు.సంవత్సర కాల వ్యవధిలో రెండు పర్యాయాలు కరోనా మహమ్మారి చేసిన గాయం కారణంగా సొమ్మసిల్లి నడ్డి విరిగిన సామాన్య ప్రజలు ఇప్పుడిప్పుడే అంబాడుతూ నడిచే ప్రయత్నం చేస్తుంటే పెట్రోల్ ధరలు పెంచి అగ్గి పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బండి బయటకు తీయాలంటే గుండె గుభేల్ మంటున్నదని వాపోయారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూర్ఖంగా వ్యవహరిస్తూ ఇప్పటికే  ఆర్థికంగా కుదేలై మూలుగుతున్న ప్రజలపై భారం వేసి ముక్కు పిండి వసూలు చేసి  ఆయిల్ కంపెనీలకు దోచి పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ మతిలేని ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి వాటి మూలంగా నిత్యావసర ధరలు మండిపోతాయి. అలాగే పెరిగిన డీజిల్ కారణంగా ట్రాక్టర్ కిరాయిలు పెరిగి రైతులు అధిక సంఖ్యలో నష్టపోతారు. ద్రవ్యోల్బణం అమాంతం ఎగబాకుతోంది అని గుర్తు చేశారు. పెట్రోలు పై మోదీ వసూలు చేసే ఎక్సైజ్ సుంకం కు తోడు కెసిఆర్ వసూలు చేసే వ్యాట్ పెట్రోల్ ధరలో మూడింట రెండు వంతులు ఉంటుందని, ఇటువంటి  విపత్కర పరిస్థితుల్లో తక్షణమే సుంకాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేసి జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని శపదం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ  కౌన్సిలర్ సోగ్రాబి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ  అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నయీమ్, పట్టణ మాజీ అధ్యక్షుడు ఏ ఆర్ అక్బర్, కార్యదర్శి  మేకల నరసయ్య, వెంకటేశ్వర దేవాలయ మాజీ ధర్మకర్త దండవేణి వెంకటేష్, సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ, వాసం అజయ్, నసీర్, పోతుగంటి శంకర్ గౌడ్, గడేల అశోక్, దండిక రాజం, చిటిమెల్లి రంజిత్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మెట్ పెల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. 
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి అన్నారు. శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకుల వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోన మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని అన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటిందని, ఈ పెరుగుదల వల్ల  అన్ని గృహవసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. గత 13 నెలల్లో, పెట్రోల్ పై లీటర్ కు రూ.25.72 డీజిల్ పై లీటరుకు  23.93 పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని,  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంపుల ముందు నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల  ఆర్థిక మందగమనం, విపరీతమైన నిరుద్యోగం, వేతనాలలో కోత,  ఉద్యోగ నష్టాలు మరియు అధిక ధరల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఈ  ప్రజా వ్యతిరేక అంశాలపై మనం నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఖుటుబోద్దీన్ పాషా, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గం శేఖర్, మహమ్మద్ మూకీమ్, గుంటుక రమేష్ ,మొహమ్మద్ ఆవేజ్, సంతోష్ రెడ్డి, కోటగిరి చైతన్య ,విక్రమ్, అజయ్, మహేందర్, రఘు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మేడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసన. 
మేడిపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ ఆవరణలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని, పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు .కరోనా సమయంలో సామాన్యుని వైద్యానికి నోచుకోని ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఉన్నాయని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను మానుకోవాలన్నారు .వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయని సామాన్యుడి నడ్డి విరిచేందుకు ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. దేశమంతా కరోనా మహమ్మారితో వైద్యానికి డబ్బులు లేవని కనీసం ఇప్పుడు కడుపునిండా తిందామనుకున్నా చమురు ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి కొనలేని పరిస్థితులు సామాన్యులకు ఎదురైందన్నారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి పెరిగిన చమురు ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు రమేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు బొమ్మెన ప్రశాంత్, ఉరుమట్ల లక్ష్మణ్ దామోదర్, జలంధర్ రెడ్డి, యూసుఫ్, ఉరుమట్ల నర్సయ్య ,నర్సారెడ్డి, సయ్యద్ ,జీవన్ రెడ్డి, కల్లెడ వినయ్, ఒక్కురి నరేష్, గంగారెడ్డి, అరుణ్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts