
టోక్యో జూన్ 14
జూలై 23వ తేదీ నుండి టోక్యోలో ప్రారంభంకానున్న ఒలింపిక్స్ క్రీడల నేపద్యం లో ..ఈ మహావేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం సుమారు లక్షా 50 వేల కండోమ్‌లు పంపిణీ చేసేందుకు నిర్వహకులు సిద్ధం అయ్యారు. టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లో బస చేసే అథ్లెట్లకు ఆ కండోమ్‌లను ఇవ్వనున్నారు. అయితే ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న సమయంలో ఆ కండోమ్‌లను వాడవద్దు అంటూ నిర్వహకులు సూచనలు చేశారు. స్వదేశం తిరిగి వెళ్లే వరకు ఆ కండోమ్‌లను దాచుకోవాలని, తమతమ దేశాల్లో ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలని ఒలింపిక్స్ నిర్వహకులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా వరకు కఠినతరమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక సోషల్ డిస్టాన్సింగ్ కూడా పాటిస్తున్నారు.
1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కండోమ్‌లను పంపిణీ చేస్తున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అథ్లెట్లకు కండోమ్‌లను ఇవ్వడం జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లో హెచ్ఐవీ కేసులు పెరిగాయి. సింధు ప్రావిన్సులో కలుషిత సూదులు వాడడం వల్ల ఎక్కువ స్థాయిలో అక్కడ ఎయిడ్స్ కేసులు నమోదు అవుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక టోక్యో గేమ్స్ సమయంలో అథ్లెట్లు దూరం పాటించాలని, భోజనం చేసే సమయంలోనూ ఎవరూ గుమ్మికూడవద్దు అని పేర్కొన్నారు. ఒంటరిగానే భోజనం చేయాలంటూ అథ్లెట్లకు సంకేతాలు ఇచ్చారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.