YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అష్ట సిద్ధులు అని వేటిని అంటారు?

అష్ట సిద్ధులు అని వేటిని అంటారు?

*అణిమ*: అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట .
*మహిమ*:బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట.
*లఘిమ*:దూది కంటే తేలిక అయ్యి ఉండుట. యే మాత్రం బరువు లేకుండా ఉండుట .
*గరిమ* : బరువుగల సమస్త జీవములు, సమస్త పదార్దముల కంటే బరువు అయ్యి ఉండుట.
*ప్రాప్తి* : కోరిన దానినేల్లా కలగ చేసుకొనుట . తనకే ఆకారం కావలెను అన్న ఆ ఆకారంని పొందుట. కొరిన చోటుకెల్లా క్షణ మాత్రములో పోవుట , కొరిన వస్తువుని గాని జీవముని గాని తన వద్దకి తెప్పించు కొనుట .
*ప్రాకామ్యము* : ఆకాశ గమనము కలిగి యుండుట, తన శరీరం వదిలి త్రిలోక సుందరమగు యవ్వన శరీరము తాను కోరినంత కాలము పొంది యుండుట.
*వశిత్వము:* సమస్త జంతువులను , దుష్ట మృగములను పెద్ద పులి,చిరుత పులి , సింహము, మదగజము మొదలగు అడివి జంతువులను మొసలి, తాంబేలు, చేప మొదలగు నీటి జంతువులను, సర్పములు మొదలగు వాటిని మచ్చిక చేసుకొనుట .
*ఈశత్వము* : కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనెడు అరిషడ్వర్గములను జయించి ఆధ్యాత్మిక , బౌతికాది ధైవికములు అనెడి తాపత్రయములు లేనివాడై జితేన్ద్రియుడై , భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరుని వలే సృష్టి, స్థితి, లయములు లకు కారణ భూతుడు అగుట .
అష్ట సిద్ధులను పురాణ పురుషులు ప్రదర్శించారు.
అణిమా సిద్ధిని హనుమంతుడు సీతాన్వేషణ లో భాగంగా లంకలో ప్రవేశించేటపుడు చిన్న పరిమాణంలో మారి ప్రదర్శించాడు.
మహిమా సిద్ధిని హను మంతుడు సముద్రోల్లంఘన సమయంలో ప్రదర్శించాడు.
ఇక సురస నోరు తెరిచినపుడు పెద్దవాడుగా మారి ఒక్క సారిగా చిన్నవాడిగా మారి అణిమా మహిమా సిద్ధుల్ని ఒక దాని వెంట ఒకటి ప్రదర్శిం చాడు.
ఇంకా ఎన్నో చోట్ల ఆయన కాయాన్ని పెంచడం కనిపిస్తుంది. 
ఇక వామనావతారంలో విష్ణువు మూడడు గులతో భూమ్యా కాశాలను ఆవరించిన పుడు కూడా ఇదే విధంగా పెరిగాడు. 
గరిమా సిద్ధిని కృష్ణుడు చిన్నతనంలో తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో ఎత్తుకు పోవడానికి వచ్చినపుడు అతనితో బాటు పైకె గిరి వాడి భుజాల మీద కూర్చుని బరువుగా మరరడంతో వాడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వాడిని కృష్ణుడు చంపివేశాడు.
భీముడు సౌగంధిక పుష్పాలను తెచ్చేందుకు వెళ్లినపుడు హనుమంతుడుడు తన తోకను అడ్డుగా పెట్టి దానిని భీముడు ఎత్తలేనంత బరువుగా మార్చాడు.
లఘిమా అంటే తేలికగా అయిపోవడం. ఆకాశగమనం వంటివి కూడా దీనితో అనుబంధంగా వచ్చే శక్తులని చెబుతారు.
ఈ సిద్ధుల ప్రదర్శన మనకు రామాయణ, భాగవతాదుల్లో ప్రముఖంగా కనిపిస్తుంది.
ఒక్క సిద్ధి సరైన గురువు వద్ద పొండానికే 40 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. దీనికి సంబందించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆది శంకరులకు ఒక పర్యాయంఒక సిద్ధుడు తారసపడ్డాడు.తన కు ఉన్న ఆకాశ గమన విద్యను ఆయన ముందు ప్రర్శించాడు. అది సాధించేందుకు ఎంత కాలం పట్టిందని ఆయన అడిగారు. 40 ఏళ్లు పట్టిందని చెప్పాడు. ఆ విద్య పొందేందుకు నీ జీవితంలో 40 ఏళ్లు ఖర్చు పెట్టావు. ఏ సత్పురుషుడిని దూషించినా కాకివై పుట్టి పుట్టుకతోనే ఆకాశగమనం సాధించేవాడివి కదా అని ఆయన ఎద్దేవా చేసినట్టు చెబుతారు. సిద్ధులు సాధించడం అనవసరమని, అందుకు జీవితం లో అంత కాలం వృధా చేయకుండా భగవన్నామ స్మరణ వల్ల ఉత్తమ గతులు పొందితే బాగుండుననేది ఆయన ఉద్దేశం.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts