YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన టీఎస్‌ఆర్టీసీ

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన టీఎస్‌ఆర్టీసీ

హైదరాబాద్‌ జూన్ 21
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం మెరుగుపడుతున్నది. ఈక్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా టీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు నడుపనున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపుతామన్నారు. అదేవిధంగా కర్ణాటకకు కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులను నడపనుంది. బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు సర్వీసులను అందుబాటులో ఉంచుతుంది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా సర్వీసులను నిలిపివేయనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులను బంద్‌ చేయనుంది.

Related Posts