YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

తమకు డబ్బులు అప్పుగా ఇస్తే బిట్ కాయిన్..

తమకు డబ్బులు అప్పుగా ఇస్తే  బిట్ కాయిన్..

హైదరాబాద్
నెట్లెర్. క్రిస్టో కరెన్సీ లో పెట్టుబడులు పెట్టి అధిక లాభం ముట్ట చెప్పుతానని నమ్మించి పలువురు వద్ద కోట్లాది రూపాయిల దండుకొని తప్పించుకొని తిరుగుతున్న తండ్రి కొడుకులను చాదర్ ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్ పేట రేస్ కోర్స్ రోడ్డు లో నివాసముండే సంతోష్ మైసారి.. మోహన్ మైసారి తండ్రి కొడుకులు..ఆన్ లైన్ కరెన్సీ వ్యాపారం చేస్తున్న తమకు డబ్బులు అప్పుగా ఇస్తే వడ్డీ తో పాటు లాభాల లో శాతం ఇస్తామని నమ్మబలికారు. దింతో గత కొన్ని సంవత్సరాలుగా  పలువురు ఆశపడి రిటైర్డ్ ఉద్యోగులు. వ్యాపారులు.నిరుద్యోగులు లక్షలాది రూపాయలు ముట్టచెప్పారు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అంతే కాకుండా ఇంటికి వెళ్లితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి కొందరు వద్ద అప్పు తీసుకొని చెల్లిస్తామని వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకొనే వారు. తెలివిగా వారి అకౌంట్ నుంచి వీరి ఖాతాలో జమ చేసుకొనే వారు.అడిగితే తప్పుగా జమ అయ్యాయని.మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు.చివరకు  బాధితులు చాదర్ ఘాట్ పోలీసుకు పిర్యాదు చేశారు.కేస్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు పలువురి వద్ద కోట్లాది రూపాయలు దండుకున్నారని బాధితులు చెబుతున్నారు. వీరిపై హర్యానా తో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నట్లు తెలుస్తుoది

Related Posts