YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి మంగళస్నానం.

శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి మంగళస్నానం.

శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి మంగళస్నానం.స్నాన పున్నిమ జ్యేష్ఠ పౌర్ణమి నాడు "పూరీజగన్నాథ దివ్య దారు మూల మూర్తులకు అభిషేకం"  ఆధ్యాత్మిక చైతన్యానికీ, భక్తి ఉద్యమానికీ ప్రధాన కేంద్రం పూరీ జగన్నాథ క్షేత్రం. ఒర్రిస్సా రాష్ట్రంలోని ఈ పురుషోత్తమ క్షేత్రం అనాదిగా ఎన్నో ప్రత్యేక విశష్టతలు కలబోసుకొని ప్రపంచాకర్షణని సాధిమ్చింది. కృష్ణభక్తి ఉద్యమకర్త చైతన్య మహాప్రభువు సేవించి తరించి ముక్తి పొందిన పవిత్ర ధామమిది. ఆదిశంకరులు దర్శించి పరవశించి, తన నాలుగు పీఠాల్లో ఒకదాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. వ్శిష్టమైన ఉత్కళ కళలకీ, జీవన రీతికీ, ఆధారంగా ఉన్న దైవం పురీ జగన్నాథుడు. యుగయుగాలుగా విభిన్న రీతుల్లో విష్ణువు పూజలందుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కృతయుగాది నుండి నీలమాధవునిగా, నీలాచలంలో వెలసి దేవ, ఋషులచే సేవించబడి, జగన్నాథ, బలభద్ర, సుభద్రా మూర్తులుగా దారు విగ్రహాలతో ఆవిర్భవించి "దారుబ్రహ్మము" గా సంభావించబడుతున్న ఆ మూల మూర్తులకు అభిషేకాన్ని కనులారా తిలకించి తరించే శుభవేళ నేడు.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts