YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

భారీగా తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు

భారీగా తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు

విజయవాడ, జూన్ 26 
ఆంధ్రప్రదేశ్‌కు గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ. 638కోట్ల రూపాయలు. గత ఆర్థిక సంవత్సరం అంటే.. 2020 ఏప్రిల్ నుంచి 21 మార్చి వరకూ అన్నమాట. ఈ మధ్య కాలంలో ఇండియాకు వచ్చిన ఎఫ్‌డీఐలు… రూ. ఆరు లక్షల 14వేల కోట్లు. ఈ పెట్టుబడులన్నీ అన్నీ రాష్ట్రాలకు కలిపి వచ్చినవి. సగటు చేసుకున్న కనీసం రూ. ఇరవై వేల కోట్ల పెట్టుబడులన్నా రావాల్సి ఉంది. కానీ వచ్చింది.. కేవలం ఆరు వందల కోట్లకు కొద్దిగా ఎక్కువ. మొత్తంగా ఇండియాకు వచ్చిన పరిశ్రమల్లో … 0.10 శాతం మాత్రమే. అదీకూడా.. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పెట్టిన పరిశ్రమల్లో విస్తరణ కోసం.. అదనపు పెట్టుబడిగా పెట్టడానికి తీసుకు వచ్చినవి. కొత్త పరిశ్రమల కోసం కాదు. అంతకు ముందు ఏడాది కన్నా.. గత ఏడాది ఏపీ పరిస్థితి మరింత దిజారింది. ఏపీకి 2019 అక్టోబరు నుంచి 2020 మార్చి వరకు రూ.1,4756 కోట్లు వచ్చాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తంలో సగం కూడా రాలేదు. పొరుగున ఉన్న తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రానికి తెలంగాణకు రూ.8,617 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఒకటిన్నర శాతం. ఈ లెక్కలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. సహజంగానే అత్యధిక పెట్టుబడులు గుజరాత్, మహాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్లాయి. గుజరాత్‌కు సింహ భాగం పెట్టుబడులు వెళ్లాయి. కేంద్రం ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం ఓ కారణం అయితే.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ప్రమోట్ చేయడానికి కేంద్రం పెద్దగా సిద్ధంగా లేకపోవడం మరో కారణం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం.. .. తమ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని లెక్కలు ప్రకటించుకుంటోంది కానీ.. వాస్తవంగా వస్తున్నవి ఏమీ లేదని .. తరచూ ఇలాంటి వాస్తవాలతో వెలుగులోకి వస్తూ ఉంటుంది.

Related Posts