YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఇంకొన్నాళ్లు... ఆన్ లైన్ క్లాసులే

ఇంకొన్నాళ్లు... ఆన్ లైన్ క్లాసులే

హైదరాబాద్, జూన్ 28, 
కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దివాళా తీసిన వ్యాపారాలు.. ఊడిన ఉద్యోగాలు.. దాచుకున్న సొమ్మంతా మందు గోళీల పాలు.. తమలో ఒకరిగా మెలిగిన ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు.. ఎలా మహమ్మారి మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కరోనా కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఈ కరోనా వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు స్కూల్ కి వెళ్లక సంవత్సరం దాటింది.కరోనా తొలి వేవ్ కాస్త తగ్గుముఖం పడ్డాక దేశవ్యాప్తంగా మళ్ళీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయని ఊహించారు. కానీ, మళ్ళీ సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా వచ్చి పడింది. ఇప్పుడు సెకండ్ వేవ్ చివరి దశకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించాలని భావించింది. కానీ థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మరోసారి సమాలోచనలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఆన్ లైన్ క్లాసులు.. టీవీ పాఠాలకే మొగ్గుచూపింది.ర్కార్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం ఇప్పట్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం అంత మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇంటర్ విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మూడు నుంచి పదో తరగతి వారికి మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా ముందుగా రికార్డు చేసిన తరగతులను ప్రసారం చేయనున్నారు.
తెలంగాణలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ప్రయత్నిస్తుంది. జులై 1 నుంచి ఆప్‌లైన్‌ తరగతులంటూ ఇప్పటికే ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే కరోనా నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులను సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ విద్యావిధానం అమలును ప్రకటించనున్నారు. అయితే డిగ్రీ, పీజీ ఫైనల్‌ ఇయర్ పరీక్షలు నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది

Related Posts