YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

చెత్తను ఆదాయ వనరుగా మారుస్తాం :మంత్రి హరీశ్‌ రావు

చెత్తను ఆదాయ వనరుగా మారుస్తాం :మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట జూలై 1
చెత్తను ఆదాయ వనరుగా మారుస్తామన్నారు మంత్రి హరీశ్‌ రావు. చెత్త ద్వారా గ్యాస్‌ తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే సిద్దిపేట పట్టణంలో చెత్త ద్వారా గ్యాస్‌ తయారుచేసే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేటలోని స్వచ్ఛబడిని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. చెత్త నుంచి సంపద సృష్టిపై అవగాహన కోసమే స్వచ్ఛబడిని ఏర్పాటు చేశామన్నారు. రేపటి తరానికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆస్తిగా అందిద్దామని అన్నారు. సిద్దిపేటను చెత్త రహిత పట్టణంగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చెత్తతో తయారైన సేంద్రియ ఎరువులను, సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకూ చెత్త గురించి సిద్దిపేట స్వచ్ఛబడి పాఠాలు నేర్పుతుందని చెప్పారు

Related Posts