
ఇరాక్ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో ఘోర అగ్నిప్రమాదం: 52 మంది మృతి
బాగ్దాద్ జూలై 13
ఇరాక్‌లో ఓ ఆస్పత్రి కొవిడ్ వార్డులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 52 మంది చనిపోగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాక్ నస్రీయా నగరంలోని అల్ హుస్సేయిన్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. ఆ సమయంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషెంట్లంతా మంటల్లో చిక్కుకుని హాహా కారాలు చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఒకరిద్దరు నర్సులు తప్ప విధులు ఎవరూ లేరు. దీంతో వాళ్లను రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు.కాగా, ఆ వార్డులో కెపాసిటీ 70 పడకలుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాక్‌లో గత మూడునెలల్లో ఇలాంటి ఘటన రెండోది ఇది. ఏప్రిల్‌లో రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 82 మంది మరణించగా.. 110 మంది గాయపడ్డారు.