YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్యాయం మంత్రి అవంతి శ్రీనివాస్

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్యాయం మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై ఎంపీ విజయసాయిరెడ్డి అద్వరంలో కార్మిక సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసాం. ఎంతో మంది త్యాగాలు, ప్రాణాలు తో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. కేంద్ర,రాష్ట్రాలు గత 20 సంవత్సరాల్లో ఎంతో ఆదాయం ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే చాలా అన్యాయని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి 2 సారులు లేఖలు రాశారు. 153 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు దీక్షలు చేస్తుంటే కేంద్రం కి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కి ఎన్ని హామీలు ఇచ్చారు కానీ ఎక్క హామీని నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీలో ఉన్న ఏకైక అతి పెద్ద కర్మాగారం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఉద్యమం ఉధృతంగా చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమం ఢిల్లీ వీధుల్లో చేసి తెలుగు వారి సత్తా చూపిస్తాం. రాబోయే పార్లమెంట్ సభా సమావేశాల్లో గెట్టిగా స్టీల్ ప్లాంట్ అంశం పై కేంద్రాన్ని నిలదిస్తామని అన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతికరేకిస్తుంది. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభల్లోకి తీసుకురావాలి కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మకూడదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత మైన్స్ కేటాయిస్తే కచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలు నడుస్తుంది. విశాఖ కు దగ్గరలో ఉన్న మైన్స్ ని కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభల బాటలో నడుస్తుంది. కొత్తగా వచ్చిన కేంద్ర మంత్రిని కలిని స్టీల్ ప్లాంట్ అంశాలను వివరిస్తామని అన్నారు. బీజేపీ ఏతర పక్షాలను అటు రాజ్యసభ, లోకసభ లో పోడియం ముందు మా నిరసన తెలియచేస్తాం. జంతర్ మంతర్ లో 2 రోజుల పాటు నిరసన తెలపాలి అని కార్మిక సంఘాలు  నిర్ణయించారు. స్టీల్ ప్లాంట్ ని వ్యతిరేకించే అన్ని పార్టీలను తీసుకు వెళ్లి జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తాం. త్వరలోనే సీఎం తో కార్మిక సంఘాల నేతల భేటి ఉంటుందని అన్నారు.

Related Posts