.jpg)
అరుణాచల్ బోర్డర్ లో చైనా అధ్యక్షుడి పర్యటన
న్యూఢిల్లీ, జూలై 23,
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న ఓ గ్రామంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటించారు. టిబెట్ పర్యటనలో భాగంగా ఆయన ఆ బోర్డర్ ప్రదేశాలను విజిట్ చేశారు. అరుణాల్‌కు బోర్డర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో జిన్‌పింగ్ విమానం ల్యాండ్ అయ్యింది. టిబెట్ రాజధాని లాసా పర్యటనకు ముందు.. ఆయన యర్లుంగ్ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నది వద్దకు వెళ్లి బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించారు. యర్లుంగ్ నది అరుణాచల్ ప్రదేశ్‌లో కలవకముందు ఉన్న టిబెట్‌లోని గ్రేట్‌బెండ్ లోయ ప్రాంతాల్లో చైనా బ్రిడ్జ్ కడుతున్న విషయం తెలిసిందే. సిచువాన్-టిబెట్ రైల్వే ప్రాజెక్టు పనులను కూడా పరిశీలించేందుకు ఆయన నింగ్చి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి ఆయన లాసాకు రైళ్లో వెళ్లారు.