YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వరంగల్ లో ఎర్రబెండ

 వరంగల్ లో ఎర్రబెండ

వరంగల్, జూలై 24,
బెండకాయ పిల్లలనుంచి పెద్దల వరకూ ఇష్టంగా తినే కూరగాయ.. బెండకాయను తింటే పిలల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని.. పెద్దలకైతే కీళ్ల నొప్పుల నుంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్మకం. ఇక బెండకాయతో అనేక రకాలైన వంటకాలు కూడా తయారు చేసుకుంటారు. అయితే మనం సర్వసాధారణంగా బెండకాయ రంగు ఏది అంటే ఆకుపచ్చ రంగు అంటాం.. కానీ బెండకాయ కూడా ఎరుపు రంగులో ఉంటాయని.. వాటిని తెలంగాణలో ఓ రైతు సేంద్రీయ పద్దతిలో పండిస్తున్నాడు.వరంగల్కు చెందిన పెంబర్తికి చెందిన ప్రభాకర్రెడ్డికి సేంద్రీయ వ్యవసాయం పై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇటీవల అతను తన పొలంలో ఎరుపు రంగులో ఉన్న బెండను సాగు చేశాడు. ఈ బెండ చాలా అరుదైన రకమని.. ఈ వంగడాన్ని ‘రాధిక’ అని పిలుస్తారని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ బెండకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని.. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని చెబుతున్నాడు.ఈ బెండకాయ ఎక్కువగా చలి ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలమని ఉద్యావనశాఖా అదిఆకృ చెప్పారు. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బెండకాయ తెలంగాణలో చాల అరుదుగా సాగు చేస్తున్నారని తెలిపారు.. ఇక రక్తహీనతకు ఈ బెండ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు

Related Posts