YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బ్యాంకు దివాళా తీస్తే 5 లక్షలు

బ్యాంకు దివాళా తీస్తే 5 లక్షలు

బ్యాంకు దివాళా తీస్తే 5 లక్షలు
ముంబై, జూలై 30, 
దివాళా తీసిన బ్యాంకుల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు కేంద్ర కేబినెట్ కొద్దిగా ఊరట‌ను క‌లిగించే విష‌యం చెప్పింది. ఈ మేర‌కు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ యాక్ట్ 1961 (డీఐసీజీసీ యాక్ట్)కు కేంద్ర కేబినెట్  మార్పులు చేసింది. ఈ క్ర‌మంలో దివాళా తీసిన బ్యాంకులకు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు అందే మొత్తం పెరుగుతుంది.ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే ఈ కొత్త యాక్ట్ ప్ర‌కారం క‌స్ట‌మ‌ర్లు రూ.5 ల‌క్ష‌లు బ్యాంకు నుంచి పొంద‌వ‌చ్చు. బ్యాంకు మార‌టోరియం ప‌రిధిలో ఉంటే క‌స్ట‌మ‌ర్ల‌కు 90 రోజుల్లోగా ఆ మొత్తం వ‌స్తుంది. ఇందుకు ఆర్‌బీఐ ఎలాంటి అభ్యంత‌రాలు చెప్ప‌దు. ఆర్‌బీఐ బ్యాంకును ర‌క్షించేంత వ‌ర‌కు క‌స్ట‌మ‌ర్లు ఎదురు చూడాల్సిన ప‌నిలేదు.గ‌తేడాది ఈ మొత్తాన్ని కేంద్రం రూ.1 ల‌క్ష నుంచి రూ.5 ల‌క్ష‌ల‌కు పెంచింది. అయితే ఈ యాక్ట్‌లో చేసిన మార్పుల‌కు బుధ‌వారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ యాక్ట్ త్వ‌ర‌లో అమలులోకి రానుంది. ఈ క్ర‌మంలో పంజాబ్‌, మ‌హారాష్ట్రా కో ఆప‌రేటివ్ బ్యాంకులు, యెస్ బ్యాంక్‌, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ వంటి బ్యాంకుల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ల‌కు కొద్దిగా ఊర‌ట క‌ల‌గ‌నుంది.బ్యాంకులు దివాళా తీసిన ప‌క్షంలో క‌స్ట‌మ‌ర్ల‌కు చెందిన సేవింగ్స్, క‌రెంట్‌, ఫిక్స్‌డ్ డిపాటిట్ ఖాతాల్లో ఉన్న సొమ్ముకు డీఐసీజీసీ రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ ఇస్తుంది. ఆ మొత్తం క‌స్ట‌మ‌ర్ల‌కు అందుతుంది. దేశంలోని అన్ని ర‌కాల బ్యాంకుల‌కు చెందిన అన్ని ర‌కాల క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ఇన్సూరెన్స్ వ‌ర్తిస్తుంది

Related Posts