YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

ఆసియా దేశాల్లో ఈ క్రిప్టో అడాష్షన్లో టాప్ 10లో నిలిచిన భారత్

ఆసియా దేశాల్లో ఈ క్రిప్టో అడాష్షన్లో టాప్ 10లో నిలిచిన భారత్

ఆసియా దేశాల్లో ఈ క్రిప్టో అడాష్షన్లో టాప్ 10లో నిలిచిన భారత్
న్యూ ఢిల్లీ ఆగష్టు 17
ఈ క్రిప్టో అడాప్షన్కు సంబంధించిన పలు అంశాలపై పలు దేశాల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేల్లో పాల్గొన్న ఇండియన్స్లో 30 పర్సెంట్ పీపుల్ తమ వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని పేర్కొన్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘పైండర్’ ఈ క్రిప్టో కరెన్సీపై సర్వే నిర్వహించగా సర్వేలో ఇండియా మూడో స్థానంలో నిలబడింది. ఇండియన్స్లో 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల లోపున్న వారు ఈ క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపినట్లు సర్వేలో తేలింది. క్రిప్టో కరెన్సీని ఎక్కువగా కలిగి ఉన్నదేశాల్లో వియత్నాం పౌరులు ముందు వరుసలో ఉన్నారు. వియత్నాం కంట్రీలో 41 శాతం మంది క్రిప్టోను కలిగి ఉన్నట్లు చెప్పగా 59 శాతం మంది ఇతర పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు.భారత్లో 30 శాతం మంది క్రిప్టో కరెన్సీ వైపు ఇంట్రెస్ట్ చూపగా మిగిలిన 70 శాతం మంది ఇతర పెట్టుబడుల వైపు మొగ్గు చూపారని సర్వే స్పష్టం చేసింది. అయితే క్రిప్టోకరెన్సీపై పూర్తి స్థాయిలో అందరికీ ఇంకా అవగాహన రాలేదని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అందరికీ ఈ కరెన్సీ గురించి అర్థమైతే అందరూ ఇటు వైపు మరలుతారని చెప్తున్నారు ఆర్థికవేత్తలు. ఈ క్రిప్టోకరెన్సీ డిజిటల్ యాప్స్ ఫోన్ పే గూగుల్ పే లాంటివే అని మీరుకుంటే పొరపడినట్లే. ఇది అలా కాదు. ఇది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. పీర్ టు పీర్ నెట్వర్క్గా ఈ పేమెంట్ సిస్టమ్ పని చేస్తుంది. ఈ క్రిప్టోకరెన్సీని డిజిటల్ వాలెట్లో దాచుకోవచ్చు. కావాలనుకున్నపుడు ఖరచ్చు పెట్టుకోవచ్చు.కోడింగ్ ఎన్క్రిప్షన్తో ట్రాంజాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే కోడింగ్ ఎన్క్రిప్షన్ రికార్డ్స్ అన్నీ కూడా పబ్లిక్ లెడ్జర్లో రికార్డవుతాయి. ఎన్క్రిప్షన్ ద్వారా క్రిప్టోకరెన్సీ సురక్షితంగానే ఉంటుంది. ఇకపోతే విదేశాల్లో ఈ కరెన్సీ గురించి ఎంతో కొంత స్పష్టమైన అవగాహన ఉండగా వారు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో ఆ విషయాలే బయటపడ్డాయి.హాంగ్కాంగ్లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 30 శాతం మంది ఇతర పెట్టుబడులు కలిగిన వారు 70 శాతం మంది ఉన్నారు. మలేషియాలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 29 శాతం మంది ఇతర పెట్టుబడులు కలిగిన వారు 71 శాతం మంది ఉన్నారు. పిలిప్పైన్స్లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 28 శాతం మంది ఇతర పెట్టుబడులు కలిగిన వారు 77 శాతం మంది ఉండగా బెల్జియంలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 26 శాతం మంది ఇతర పెట్టుబడులు కలిగిన వారు 74 శాతం మంది ఉన్నారు.మొత్తంగా క్రిప్టో కరెన్సీని అత్యధికంగా కలిగి ఉన్న దేశాల్లో వియత్నం మొదటిది. కాగా ఆ తర్వాత వరుసగా ఇండోనేషియా ఇండియా మలేషియా పిలిప్పైన్స్ ఉన్నాయి. అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్న అమెరికా యూకేల్లో ప్రజలు క్రిప్టోను తక్కువ స్థాయిలోనే వాడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో 8 శాతం మంది యూకేలో 9 శాతం మంది క్రిప్టోను యూజ్ చేస్తున్నారు.మొత్తానికి డిజిటల్ సిస్టమ్స్ యూసేజ్లో ప్రస్తుతం భారత్ సత్తా చాటుతున్నది. ఈ క్రిప్టో అడాష్షన్లో ఆసియా దేశాలు ముందున్నాయి. టాప్ 10లో నిలిచిన ఆసియా దేశాల్లో భారత్ ఉంది.

Related Posts