YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సవాల్ కు సిద్దం మంత్రి మల్లారెడ్డి... రేవంత్ బాష మార్చుకోవాలి పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి ...

సవాల్ కు సిద్దం మంత్రి మల్లారెడ్డి... రేవంత్ బాష మార్చుకోవాలి పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి ...

హైదరాబాద్
నేను నిన్న చేసిన సవాల్ కు సిద్ధంగా ఉన్ననని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాజీనామా చేయడానికి వెనక్కి తగ్గేది లేదు. రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదు. రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత  నా నిర్ణయం ఉంటుంది. నేను భూ ఆక్రమణలు చేయలేదం..దమ్ముంటే రేవంత్ రెడ్డి నిరూపించాలి.  రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తిట్టిన తర్వాతే నేను తిట్టడం మొదలు పెట్టా..రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ తిట్టగలుగుతానని అన్నారు...

వంత్ రెడ్డి ఓ డ్రామా ఆర్టిస్టు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉంది రేవంత్ తీరు. టెంట్ , స్టంట్ , ప్రెసెంట్ , ఆబ్సెంట్ అన్నట్టుగా రేవంత్ రాజకీయం నడుస్తోందని తెరాస ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ తొక్కుతా అంటున్నాడు. వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న టీ ఆర్ ఎస్ తలుచుకుంటే నిన్ను ఎంత తొక్కగలం రేవంత్. రేవంత్ తీరు పై సోనియా , రాహుల్ కు ట్విట్టర్ లో లేఖ రాశాను. .రేవంత్ భాష గురించి రాహుల్ కు తెలుసా ? మహారాష్ట్ర లో శివ సేన ప్రభుత్వం లో కాంగ్రెస్ ఉంది. నారాయణ్ రాణే ను ఒక్క మాటకే అక్కడ మీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మరి అంత కన్నా ఎక్కువ మాట్లాడుతున్న రేవంత్ ను ఏం చేయాలని వాళ్లనే అడిగానని అన్నారు. రేవంత్ రెడ్డి టెంట్- స్టంట్- ప్రెసెంట్ ..ఆప్సెంట్ రాజకీయం నడుపుతున్నాడు. రేవంత్ రెడ్డి ది  మాటలు- మూటలు- ముఠాల సంస్కృతి .గ్రెస్ లో పెద్ద నాయకులు లేనిది చూసి దొరికింది దోచుకోవడే రేవంత్ వైఖరి. ఒక్క మల్లారెడ్డి, మైనంపల్లి మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు. వందమంది ఎమ్మెల్యేలు ఉన్నాం మాట్లాడితే తట్టుకోలేరు.మేము తొక్కితే ఎంత లోతు వెళ్తావ్. పవర్ లో రాలేమని ముందే గ్రహించి ఇష్టమొచ్చినట్లు రేవంత్ మాట్లాడుతున్నారు. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో- మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అని కాంగ్రేస్ పార్టీ నేతలు మరవద్దు.  కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయడం చివరి అస్త్రం.  లేఖ తరువాత అయినా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి. మేము కూడా కాంగ్రెస్ కొడుకుల్లారా అని అనగలం. ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రేస్ పార్టీ కేసీఆర్ లాంటి పథకాలు ఇస్తే ఇప్పుడు ఇన్ని కష్టాలు మాకెందుకు వస్తుండే? దళితుల ఇండ్లలో నిద్రచేసి వాళ్ల ఇంట్ల నీళ్లు కాకుండా కింన్లే వాటర్ తాగుతుండు.  థర్డ్ క్లాస్ మాటలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే ఆధారాలతో బయటపెట్టాలి.  రేవంత్ రెడ్డి ఎవరి పెంపుడు కుక్కవో అందరికి తెలుసు!. మల్కాజిగిరి ఎంపీగా గెలిచేందుకు చంద్రబాబు దయవల్ల రేవంత్ రెడ్డి గెలవడం నిజం కాదా? రేవంత్ రెడ్డి మాటల్లో చూపిస్తే- మేము చేతల్లో చూపిస్తూ నాలుక కోస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి  పేరును ఎక్కడైనా ప్రస్తావించారా?  సొంత పార్టీ లో లీడర్లు రేవంత్ ను ఎవ్వరూ కేర్ చేయడం లేదని ఆక్రోశంతో మాట్లాడుతున్నారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి అదే ప్రగతి భవన్ స్థలం నుంచే పాలన చేశారు కదా? అప్పుడు ఎందుకు బహుజన భవన్ పేరు పెట్టలేదు.?  కాంగ్రెస్- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం ఆఫీస్ లకు బహుజన బోర్డులు పెట్టి తెలంగాణలో మాట్లాడాలి. .రేవంత్ ది ఈవెంట్ మేనేజర్ తప్ప పీసీసీ అధ్యక్షుడి స్థాయి కాదు. దేశం లో ఎందరో పీసీసీ అధ్యక్షులు ఉన్నారు ..వాళ్ళు రేవంత్ లాంటి భాష వాడుతున్నారా ? రేవంత్ చర్యలు దుర్మార్గాలు శృతి మించితే ఏం చేయాలో మాకు తెలుసు. కెసిఆర్ ను డీ కొట్టే స్థాయి రేవంత్ ది కాదని అయన అన్నారు. 

Related Posts