YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సీఎంలు కలలు నెరవేరేనా

సీఎంలు కలలు నెరవేరేనా

హైదరాబాద్, ఆగస్టు 27, 
ఎప్పుడైనా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మరింత కాలం అధికారంలో ఉండాలని అనుకుంటాయి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని మరీ పాలన చేస్తాయి. మంచి పరిపాలన అందిస్తూ, ప్రజలని మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో ప్రజలు ఆ పార్టీలకు మరొకసారి అవకాశం కల్పిస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే పార్టీని ఆదరించడం అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒకే పార్టీని ఎక్కువ కాలం అధికారంలో కొనసాగించిన సందర్భాలు తక్కువ. ఏదో ఒకసారి చూస్తారు…రెండోసారి ఆదరిస్తారు తప్ప, మూడోసారి అధికారంలోకి కూర్చోపెట్టడం పెద్దగా జరగలేదు. గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌లు వరుసగా పదేళ్ళ పాటు అధికారంలో కొనసాగాయి. కానీ తర్వాత ఆ పార్టీలని ప్రజలే గద్దె దించేశారు. ఇక రాష్ట్రం విడిపోయాక ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి…మరో 10, 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగాలని అనుకుంది. కానీ అయిదేళ్లలోనే ప్రజలు టీడీపీని ఓడించి పక్కన కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్న జగన్ సైతం మరో 30 ఏళ్ల పాటు తానే సీఎంగా కొనసాగాలని అనుకుంటున్నారు. అటు వైసీపీ నేతలు కూడా ఇదే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు. జగన్ మరో 30 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని అంటున్నారు. మరి వాస్తవానికి ఏపీలో ఆ పరిస్తితి ఉంటుందా? అంటే ఉండదనే చెప్పొచ్చు. మహా అయితే మరొకసారి జగన్‌ని గెలిపిస్తారేమో గానీ, కంటిన్యూగా 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంచడం అయితే జరగని పని. ఇటు తెలంగాణలో అధికారంలో కేసీఆర్ సైతం…మరో 20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని మాట్లాడుతున్నారు.ఇప్పటికే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలో కొనసాగుతుంది. అంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మరొకసారి గెలిచే ఛాన్స్ ఉందా? అంటే కాస్త కష్టమనే చెప్పొచ్చు. అలాంటిది మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని కేసీఆర్ చెప్పడం కాస్త అతిశయోక్తిగానే ఉంది. జగన్ 30 ఏళ్ళు, కేసీఆర్ 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఫిక్స్ అయినా, ప్రజలు మాత్రం అందుకు సిద్ధంగా ఉండరని చెప్పొచ్చు.

Related Posts