
కాబూల్ పేలుళ్లలో 90కి చేరిన మరణించిన వారి సంఖ్య
కాబూల్ ఆగష్టు 27
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల లో 28 మంది తాలిబన్లు మృతిచెందినట్లు ఆ సంస్థ ప్రకటించుకున్నది. బాంబు పేలుళ్ల వల్ల అమెరికన్ల కన్నా ఎక్కువ సంఖ్యలో తమవారిని కోల్పోయినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే ఎయిర్‌పోర్ట్‌పై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆగస్టు 31వ డెడ్‌లైన్‌ను పొడించాల్సిన అవసరం లేదని కూడా ఓ తాలిబన్ అధికారి తెలిపారు. కాబూల్‌లో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 90కి చేరుకున్నది. దాంట్లో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్ర సంస్థ ప్రకటించింది. పేలుళ్ల వల్ల సుమారు 150 మంది గాయపడ్డినట్లు తెలుస్తోంది.ఎయిర్‌పోర్ట్ వద్ద దాడుల తర్వాత.. చాలా వరకు దేశాలు పౌరుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు లక్ష మందిని తరలించినట్లు అమెరికా చెప్పింది. గత 12 గంటల్లో ఏడు వేల మందిని తరలించినట్లు బైడెన్ తెలిపారు.రాజధాని కాబూల్‌లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలుసు కదా. ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వెళ్లడానికి మరోసారి ఆఫ్ఘన్లు ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తారు. ఈ బాంబుల భయం కంటే అక్కడి వారికి తాలిబన్ల భయం ఎంతలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలాగైనా వెళ్లి.. దేశం నుంచి బయటపడితే చాలు అన్న ఆతృత అక్కడి వారిలో కనిపిస్తోంది. శుక్రవారం ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్న పరిస్థితి వీడియోను అబ్దుల్‌హక్ ఒమెరి అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.ఎయిర్‌పోర్ట్ ముందు ఉన్న మురికి కాలువలో మోకాలి లోతు నీటిలో వాళ్లు నిరీక్షిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. గురువారం పేలుళ్ల నేపథ్యంలో శుక్రవారం ఆఫ్ఘన్ నుంచి తరలింపు ప్‌ిక్రియను మరింత వేగవంతం చేశారు. ఈ నెల 31లోపు విదేశీ బలగాలు దేశం విడిచి పెట్టనున్న నేపథ్యంలో ఆ లోపు మరోసారి ఇలాంటి దాడుల ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉన్నట్లు అమెరికా చెబుతోంది.కాగా ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో గురువారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే.ఈ దాడుల్లో వంద మందికిపైగా మరణించారు. దాని తాలూకు రక్తపు మరకలు ఇంకా చెదిరిపోనే లేదు.. దేశం విడిచి వెళ్లడానికి మరోసారి ఆఫ్ఘన్లు ఎయిర్‌పోర్ట్‌కు పోటెత్తారు. ఈ బాంబుల భయం కంటే అక్కడి వారికి తాలిబన్ల భయం ఎంతలా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలాగైనా వెళ్లి.. దేశం నుంచి బయటపడితే చాలు అన్న ఆతృత అక్కడి వారిలో కనిపిస్తోంది. శుక్రవారం ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉన్న పరిస్థితి వీడియోను అబ్దుల్‌హక్ ఒమెరి అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.ఎయిర్‌పోర్ట్ ముందు ఉన్న మురికి కాలువలో మోకాలి లోతు నీటిలో వాళ్లు నిరీక్షిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. గురువారం పేలుళ్ల నేపథ్యంలో శుక్రవారం ఆఫ్ఘన్ నుంచి తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఈ నెల 31లోపు విదేశీ బలగాలు దేశం విడిచి పెట్టనున్న నేపథ్యంలో ఆ లోపు మరోసారి ఇలాంటి దాడుల ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉన్నట్లు అమెరికా చెబుతోంది.