YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించండి . భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా తాలిబ‌న్లు లేఖ

రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించండి . భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా తాలిబ‌న్లు లేఖ

రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించండి . భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా తాలిబ‌న్లు లేఖ
న్యూఢిల్లీ సెప్టెంబర్ 29
ఆఫ్ఘ‌నిస్థాన్‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాలిబ‌న్లు తొలిసారి భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాశారు. రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆ లేఖ‌లో తాలిబ‌న్లు కోరారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘ‌నిస్థాన్ పేరుతో ఈ లేఖ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ అరుణ్ కుమార్‌కు తాలిబ‌న్లు ఈ లేఖ‌ను పంపించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హ‌మీదుల్లా అకున్‌జ‌దా ఈ లేఖ‌ను రాశారు.సెప్టెంబ‌ర్ 7వ తేదీన ఈ లేఖ రాసిన‌ట్లుగా ఉంది. మీకు తెలిసే ఉంటుంది ఈ మ‌ధ్య అమెరికా బ‌ల‌గాలు తిరిగి వెళ్లిపోయే స‌మ‌యంలో కాబూల్ ఎయిర్‌పోర్‌్‌ను దెబ్బ‌తీశారు. అయితే ఖ‌తార్ సాంకేతిక సాయంతో ఎయిర్‌పోర్ట్‌ను పున‌రుద్ధ‌రించాము. ఈ మేర‌కు ఎయిర్‌మెన్‌కు నోటీసును ఈ నెల 6న జారీ చేశాము అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా రాశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇండియా, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు.రెండు దేశాల మ‌ధ్య ప్ర‌యాణం సాఫీగా సాగాల‌న్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాము. మా అధికారిక ఎయిర్‌లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘ‌న్ ఎయిర్‌లైన్‌, కామ్ ఎయిర్ త‌మ విమానాల‌ను తిరిగి ప్రారంభించాల‌ని అనుకుంటున్నాయి. వారి వాణిజ్య విమానాలు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నాము అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా కోరారు.

Related Posts