YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

 ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మాస్క్

 ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మాస్క్

 ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మాస్క్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29, 
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 213 బిలియన్ డాలర్లతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ని అధికమించి మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. గత వారంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లా షేర్ ధర పెరగడంతో మస్క్ దాదాపు 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించారు. టెస్లా షేర్లు ఈరోజు 1.4% తగ్గి నాస్‌డాక్‌పై 780.7 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెజాన్ స్టాక్ 3%పైగా పడిపోయింది. నాస్‌డాక్‌లో 3,297.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. టెక్-హెవీ నాస్‌డాక్ మంగళవారం 2%పైగా పడిపోయింది, వాల్ స్ట్రీట్ ఇండెక్స్‌లలో టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను రోజువారీగా ప్రకటిస్తోంది.బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ యొక్క రియల్ టైమ్ డేటా ప్రకారం, జెఫ్ బెజోస్ ఆదాయం 197 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాత బెర్నార్డ్ ఆర్నాల్ట్, (LVMH) లూయిస్ విట్టన్ ఛైర్మన్ 160 బిలియన్ డాలర్లతో ఉన్నారు. ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ వరుసగా 132 బిలియన్ డాలర్లు, 128 బిలియన్ డాలర్ల ఆదాయంతో నాల్గో, ఐదో స్థానాల్లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్లా మార్కెట్ కాప్ 792 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. పాలో ఆల్టో, కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ సెడాన్‌లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను విక్రయిస్తుంది. మస్క్ స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‎గా కూడా ఉన్నారు. ఆగస్ట్ 2021 రెగ్యులేటరీ వివరాల ప్రకారం టెస్లాలో 20 శాతం అతని వాటగా ఉంది. అతని హోల్డింగ్‌లలో కొంత భాగం వ్యక్తిగత బాధ్యతల కోసం ఉపయోగిస్తారు. మూడు యూఎస్ బ్యాంకుల నుంచి దాదాపుగా 500 మిలియన్ డాలర్ల రుణాలు తీసుకున్నట్లు డిసెంబర్ 2020లో సమర్పించిన నివేదికలో తెలిపారు.

Related Posts