YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్

అద్భుత లోకాన్ని సృష్టించిన దుబాయ్

దుబాయ్, అక్టోబరు 4,
దుబాయ్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎగ్జిబిష‌న్ జ‌రుగుతున్న‌ది. అక్టోబ‌ర్ 1 వ తేదీ నుంచి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు ఆరు నెల‌ల‌పాటు ఈ ఎగ్జిబిష‌న్ జ‌రుగనున్న‌ది. దీనికోసం దుబాయ్ ఎడారి ప్రాంతంలోని 1080 ఎకరాల్లో వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి ఓ అద్భుత‌లోకాన్ని సృష్టించింది.  192 దేశాలు ఈ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన‌బోతున్నాయి.    ఆసియాలో జ‌ర‌గ‌బోతున్న తొలి అంత‌ర్జాతీయ ఎక్స్ పో కావ‌డంతో ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి భారీ అంత‌ర్జాతీయ ఎక్స్‌పోల‌ను యూర‌ప్‌, అమెరికాలో మాత్ర‌మే నిర్వ‌హించారు.  2020లోనే ఈ ఎక్స్‌పో జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.  ఆఫ్రికన్ ఫుడ్ హాల్, 20 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల పొడవైన ఇటలీ తాడు, ఈజిప్షియన్ మమ్మీ, స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రెప్లికా, టాన్స్‌ఫార్మర్‌లా మారే చైనా కారు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్ హీరో డేవిడ్ త్రీడీ బొమ్మ, అమెరికా మూడవ అధ్యక్షుడు వాడిన పవిత్ర ఖురాన్ వంటివి అనేకం ఈ ఎక్స్‌పోలో క‌నువిందు చేయ‌బోతున్నాయి

Related Posts